కర్నూలు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకం పరిధిలోకి వచ్చే గ్యాస్ వినియోగదారులు, పింఛన్‌దారులు, విద్యార్థులకు ఆధార్ నమోదులో ప్రాధాన్యం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు సూచించారు. గ్యాస్ డీలర్లతో శనివారం జేసీ తన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. గ్యాస్ వినియోగదారులకు జనవరి నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి రానుందన్నారు. అయితే జిల్లాకు సంబంధించి 5.72 లక్షల మంది గ్యాస్ వినియోగదారుల్లో ఇప్పటి వరకు 3.40 లక్షల మంది నుంచి మాత్రమే యూఐడీ, ఈఐడీ, బ్యాంకు ఖాతాల నంబర్లు సేక రణ పూర్తయిందన్నారు. వీరిలో 1.25 లక్షల మంది ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానం పూర ్తయిందన్నారు.
మిగతా వారి నుంచి యూఐడీ, ఈఐడీ నంబర్లు సేకరించే పనిని ముమ్మరం చేయాలని, వాటిని బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేసి ఎల్‌డీఎంకు పంపాలని సూచించారు. ఇదంతా అక్టోబరు చివరినాటికి వందశాతం పూర్తికావాలన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు పని చేస్తున్నాయని, నగదు బదిలీ పథకంలోకి వచ్చేవారు ఏ ప్రాంతం వారైనా వారికి ప్రాధాన్యం ఇచ్చి వారి నమోదును పూర్తి చేయించాలన్నారు. ఈ ప్రాంతం వారు కాదనో.. ఈ కేంద్రం పరిధిలోకి రారనో వెనక్కు పంపవద్దని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఓలు రాజా రఘువీర్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అత్యవసరమైన వారికి ప్రాధాన్యం
Published Sun, Sep 22 2013 5:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement