కర్నూలు: బెల్టు దుకాణాల నిర్మూలన వ్యాపారుల రాబడిపై ప్రభావం చూపనుండటంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. కొత్త మద్యం విధానం ప్రారంభమై వారం రోజులు కూడా గడవకముందే గరిష్ట చిల్లర ధరకు మంగళం పాడారు. ఫలితంగా మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. లాభాల కోసం వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్‌గా ఏర్పడి అంతర్గత ఒప్ప ందం ప్రకారం పది శాతానికి అధికంగా సరు కు విక్రయించేలా తీర్మానించుకున్నట్లు సమాచారం.
జిల్లాలో 194 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో 180 దుకాణాలకు లెసైన్సులున్నాయి. 36 బార్లు నడుస్తున్నాయి. అందులో సగానికి పైగా రాజకీయ నాయకులు, వారి అనుచరుల ఆధ్వర్యంలో నడుస్తున్నవే. పార్టీలు వేరైనా మద్యం వ్యాపారంలో మాత్రం అన్ని పార్టీల నేతలు పరోక్షంగా పాత్రధారులుగా ఉన్నారు. లక్కీడ్రాలో దుకాణాలు దక్కించుకున్నవారికి, ఎక్సైజ్ అధికారులకు మధ్య తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది.
పెట్టిన పెట్టుబడులపై లాభాలను రాబట్టేందుకు ప్రతి క్వాటర్ సీసాపై గరిష్ట చిల్లర ధరకు అదనంగా రూ.10 పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా మద్యం సామ్రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కర్నూలు సిండికేట్ మద్యం వ్యాపారులకు అండగా నిలిచింది. అధికార పార్టీ బలంతో మద్యం వ్యాపారులనంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందుకోసం స్టేషనరీ ఖర్చు పేరుతో వచ్చిన ఆదాయంలో పది శాతం ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు రూపంలో ముట్టజెప్పే విధంగా ఒప్పందం కుదిరినట్లు వినికిడి.
ఎంఆర్‌పీకే మద్యం విక్రయాలు జరపాలని నిబంధన ఉన్నా మందు బాబుల నుంచి అదనంగా గుంజడానికి వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్‌గా ఏర్పడ్డారు. కర్నూలు నగరంతో పాటు గూడూరు, కోడుమూరు, సి.బెళగల్, డోన్ ప్రాంతాల్లో గరిష్ట చిల్లర ధరపై(ఎంఆర్‌పీ) క్వాటర్ బాటిల్ రూ.10 అదనంగా విక్రయాలు జరుపుతున్నారు. ఫుల్‌బాటిల్ రూ.40 నుంచి రూ.60 వరకు ఎక్కువ ధరతో విక్రయాలు జరుపుతున్నారు. సామాన్యులు సేవించే చీఫ్ లిక్కర్, బ్యాగ్‌పైపర్, రాయల్ తదితర మద్యం క్వాటర్ బాటిల్ ధర రూ.75 ఉండగా రూ.85కు విక్రయిస్తున్నారు.
అలాగే ఎంసీ విస్కీ, ఇంపీరియల్ బ్లూ, మాన్షన్ హౌస్ గరిష్ట చిల్లర ధర రూ.110 ఉండగా రూ.120 నుం చి రూ.130 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బ్రాండెడ్‌కు బదులుగా కమిషన్ ఎక్కువగా ఇచ్చే కంపెనీలకు సంబంధిం చిన మద్యాన్ని మాత్రమే అందుబాటు లో ఉంచి లాభాలు పొందుతున్నారు. జిల్లాలో అన్ని దుకాణాల ద్వారా సగటున రోజుకు రూ.2 కోట్లపైనే వి క్రయాలు జరుగుతున్నాయి. కొత్త మద్యం విధా నం ఈ నెల 1న అమల్లోకి వచ్చింది. ఐదు రోజుల వ్యవధిలో రూ.18.87 కోట్ల మద్యం విక్రయాలు
జరిగాయి.
మద్యం ధరలకు రెక్కలు
Published Mon, Jul 7 2014 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement