Syndicate alcohol
-
Visakhapatnam: 30 షాపులకు దరఖాస్తు చేసిన ఒడిశా మద్యం వ్యాపారి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో మద్యం వ్యాపారంపై ఆధిపత్యం చెలాయించాలనుకున్న సిండికేట్‌కు తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఒడిశాకు చెందిన వ్యాపారి వివేక్ సాహు సిండికేట్‌కు ఊహించని షాక్‌నిచ్చారు. నోయిడాకు చెందిన కొంత మంది మద్యం వ్యాపారులు కూడా ఇక్కడ వ్యాపారంపై కన్నేశారు. విశాఖలో మద్యం దుకాణాల కోసం కొంత మంది సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ దరఖాస్తులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరెవరు ఏయే షాపులను దక్కించుకోవాలనే విషయంపై సోమవారం రాత్రి సీతమ్మధారలోని ఒక మద్యం వ్యాపారి గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ప్రధానంగా 8 మంది మద్యం సిండికేట్ల మధ్య ప్రాథమికంగా అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. అయితే.. ఇందుకు భిన్నంగా ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారి వివేక్ సాహు ఏకంగా 30 షాపులకు దరఖాస్తు చేశారు. నోయిడాకు చెందిన వ్యాపారులు 10 షాపుల వరకూ దరఖాస్తు చేస్తున్నట్టు సమాచారంతో స్థానిక సిండికేట్ కంగుతింది. ఆయా వ్యాపారులకు లాటరీలో షాపులు దక్కితే... వాటిని ఏ విధంగా చేజిక్కించుకోవాలనే అంశంపై తాజాగా సిండికేట్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.సిండికేట్ నేతృత్వంలో మార్పు.. కొత్త ఎమ్మెల్యే ప్రవేశంవిశాఖ మద్యం సిండికేట్ మొదటగా దరఖాస్తులు ఎక్కువ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇందుకోసం మద్యం వ్యాపారంలో ఉన్న ప్రధానమైన 8 మంది సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఈ సిండికేట్ మొన్నటివరకు ముందుండి నడిపించిన ఎమ్మెల్యే స్థానంలో.. కొత్త ఎమ్మెల్యే సారథ్యం వహించేలా ప్రణాళిక రచించారు. తద్వారా షాపులకు ఎక్కువ పోటీ రాకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణం నడుస్తున్న భవనాల వద్ద వ్యవహారం మొదలుపెట్టారు. ఆయా భవన యజమానులతో మాట్లాడుకుని.. అవి తమకే వచ్చేలా చూసుకున్నారు. ఇందుకోసం ఎకై ్సజ్ శాఖలోని కొద్ది మంది అధికారులు కూడా సహకరించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాలున్న భవనాన్ని ఫలానా మద్యం వ్యాపారులకే అద్దెకు ఇవ్వాలని కొద్ది మంది అధికారులు చర్చలు జరిపారు. అలా అయితేనే మీకు పాత అద్దెలను సక్రమంగా వచ్చేలా చూస్తామని.. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని కొద్ది మందిని బెదిరించినట్టు తెలుస్తోంది. కాగా.. లాటరీ పూర్తయిన తర్వాత వ్యాపారులు షాపులను 12నే తెరిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రధానమైన ప్రాంతాలన్నింటిలో తమ షాపులే ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఒకవేళ ఎవరైనా కొత్తవాళ్లకు షాపులు వస్తే.. భవనాలు దక్కకుండా, ప్రధానమైన ప్రాంతాల్లో వారు వ్యాపారం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడా నుంచి మద్యం వ్యాపారులు రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.విశాఖలో తక్కువ దరఖాస్తులుఉమ్మడి విశాఖ జిల్లాలో 331 మద్యం షాపులకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో విశాఖ జిల్లా పరిధిలోని 155 షాపులకు గానూ మంగళవారం సాయంత్రం 5 గంటల సమయానికి 878 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు సగటున 6 దరఖాస్తులు కూడా రాలేదు. అనకాపల్లి జిల్లాలో 136 షాపులకుగానూ 1,076 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి జిల్లాలో 40 మద్యం షాపుల్లో 36 షాపులకు మాత్రమే దరఖాస్తులు రాగా... మరో 4 షాపులకు దరఖాస్తులు రాలేదు. 36 షాపులకు మొత్తం 330 దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా విశాఖలో మద్యం వ్యాపారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. ఒక్కో షాపునకు కనీసం 40 నుంచి 50 మంది పోటీపడతారని ఊహించారు. ఇందుకు భిన్నంగా దరఖాస్తుల ప్రక్రియ ముగిసే సమయానికి సగటున 10 మందికి మించి పోటీపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒడిశా, నోయిడాల నుంచి పోటీ రావడంతో సిండికేట్ సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ఎలాగైనా వారికి షాపులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ లాటరీలో షాపులు వస్తే వాటిని ఎలా చేజిక్కించుకోవాలనే విషయంపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. -
‘ఎల్లో’ సిండికేట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర తీసిన నేపథ్యంలో ‘‘ముఖ్య’’నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు. మద్యం షాపుల ఏర్పాటుకు ‘‘ఆఫ్‌లైన్’’ ద్వారా వేల సంఖ్యలో అందుతున్న దరఖాస్తులు సిండికేట్ దందాకు పక్కా నిదర్శనంగా నిలుస్తోంది. ఆన్లైన్ ద్వారా అక్కడక్కడా అరకొరగా వచ్చిన దరఖాస్తులను సైతం సిబ్బంది ద్వారా కాగితాలపై నింపడం మద్యం అక్రమాలకు పరాకాష్ట. ఒక్కో మద్యం దుకాణానికి సగటున 20 –30 దరఖాస్తులు వస్తాయి. మారుమూల ప్రాంతాల్లోనూ కనీసం పది దరఖాస్తులు అందుతాయి. అలాంటిది మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తున్నా ఒక్కో దుకాణానికి కనీసం మూడు దరఖాస్తులు కూడా రాకపోవటాన్ని బట్టి టీడీపీ మద్యం సిండికేట్ ఏ స్థాయిలో శాసిస్తోందో వెల్లడవుతోంది. రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకుగానూ ఇప్పటివరకు 8,274 దరఖాస్తులు మాత్రమే అందడం.. అది కూడా దాదాపుగా అంతా ఆఫ్‌లైన్‌లోనే రావడం గమనార్హం. ప్రైవేట్ మద్యం దుకాణాల ద్వారా టీడీపీ సిండికేట్ దోపిడీకి కూటమి ప్రభుత్వం రాచబాట పరిచింది. టీడీపీ సిండికేట్ మినహా ఇతరులెవరూ దరఖాస్తు చేయకుండా అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ ద్వారా ఎత్తుగడ వేసింది. కేవలం ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి సమర్పించే దరఖాస్తులకే ప్రాధాన్యమిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు సాంకేతిక అడ్డంకులు సృష్టిస్తూ టీడీపీ సిండికేట్‌కు కొమ్ముకాస్తోంది. ఇతరులు ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసేందుకు యత్నిస్తే బెదిరించి వెనక్కి పంపుతున్నారు.సిండికేట్.. ఆన్‘లైన్’రాష్ట్రంలో 3,396 ప్రైవేట్ మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ఎక్సైజ్ శాఖ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. ఈ నెల 1 నుంచి 10వతేదీ వరకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా ఎక్సైజ్ కార్యాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు (ఆఫ్‌లైన్) చేసుకోవడంతోపాటు ఆన్లైన్లో కూడా సమర్పించవచ్చని పేర్కొంది. మొదటి రోజైన మంగళవారం 200 దరఖాస్తులు అందగా ఆశ్చర్యకరంగా కేవలం రెండు మాత్రమే ఆన్లైన్లో రావడం గమనార్హం. తాజాగా ఆదివారం నాటికి మొత్తం 8,274 దరఖాస్తులు రాగా వీటిలో 6,520 ఆఫ్‌లైన్‌లోనే స్వీకరించడం గమనార్హం. 1,754 దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్లో అందాయి.ఎక్సైజ్ కార్యాలయాల్లో తిష్టమద్యం దుకాణాల లైసెన్సులన్నీ గంపగుత్తగా టీడీపీ సిండికేట్‌కే దక్కాలని ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఆన్లైన్ దరఖాస్తులకు ఎక్సైజ్ శాఖ సాంకేతికంగా మోకాలడ్డుతోంది. ఎంతోమంది ఆన్లైన్ ద్వారా మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు. సాంకేతిక కారణాలు, సర్వర్ డౌన్ అంటూ దరఖాస్తులు అప్లోడ్ కావడం లేదని చెబుతున్నారు. ఎక్సైజ్ అధికారులను సంప్రదిస్తే కనీస స్పందన లేదని పేర్కొంటున్నారు. ఇదే అదునుగా టీడీపీ సిండికేట్ సభ్యులు నేరుగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాలకు వచ్చి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తున్నారు. వారంతా ఎక్సైజ్ కార్యాలయాల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు తిష్ట వేస్తున్నారు. ఇతరులు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారు. తమను కాదని దరఖాస్తు చేసినా లైసెన్సులు రావని, లాటరీ ద్వారా ఎంపిక అన్నది పూర్తిగా బోగస్ అని తేల్చి చెబుతున్నారు.దాడులు.. కేసుల బెదిరింపులుఆఫ్లైన్లో దరఖాస్తు చేస్తామని మొండికేస్తున్న వారిని టీడీపీ సిండికేట్ తీవ్ర బెదిరింపులకు గురి చేస్తోంది. ‘మమ్మల్ని కాదని దరఖాస్తు చేస్తే ఊళ్లో వ్యాపారం చేయగలవా? నీకు మద్యం దుకాణం కోసం షాపు ఎవరు అద్దెకు ఇస్తారో చూస్తాం. సొంత దుకాణంలో పెడితే ఎక్సైజ్ అధికారులతో దాడులు చేయిస్తాం. అక్రమ కేసులు బనాయిస్తాం.. ’ అని ఎక్సైజ్ అధికారుల సమక్షంలోనే హెచ్చరిస్తున్నారు. సిండికేట్‌కు సంబంధం లేని వ్యక్తులు దరఖాస్తు చేస్తే ఫోన్ నంబర్లు సేకరించి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతరులు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసేందుకు వెనుకాడుతున్నారు. మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను ఎక్సైజ్ శాఖ ఏ రోజుకు ఆ రోజు అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. తద్వారా పారదర్శకతకు పాతరేస్తూ ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు దుకాణాల లైసెన్సులు కట్టబెట్టేందుకు సహకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
దిగివచ్చిన మద్యం సిండికేట్..
మోర్తాడ్(బాల్కొండ): అక్టోబర్ నెల కోసం ప్రత్యేక ధరను అమలు చేసిన మద్యం సిండికేట్ దిగివచ్చింది. ఒక్కో సీసాపై రూ.10 ధర పెంచగా ఆ ధరను ఎత్తివేసి పాత పద్దతిలోనే ఎంఆర్పీ ధరకు మద్యంను విక్రయిస్తున్నారు. గడచిన సెప్టెంబర్ 30తోనే మద్యం దుకాణాల లైసెన్స్‌కు గడువు ముగిసిపోయింది. అయితే కొత్త మద్యం పాలసీ అమలు కావడానికి కొంత సమయం పట్టడంతో అక్టోబర్ నెల కోసం లైసెన్స్‌లను రెన్యూవల్ చేశారు. లైసెన్స్ ఫీజు ఎక్కువ చెల్లించడం, తమకు లాభం తగ్గిపోవడంతో రూ.10 ధర అదనంగా విక్రయించడానికి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఎక్కువ ధరలకు మద్యం విక్రయించడంపై ఫిర్యాదులు అందినా స్థానిక ఎక్సైజ్ అధికారులు పట్టించుకోక పోవడంతో కొందరు హైదరాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించి ఆ అధికారులు మద్యం అమ్మకాలపై నిఘా ఉంచి రెండు దుకాణాల నిర్వాహకులకు రూ.2లక్షల వరకు జరిమానా విధించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఉన్నతాధికారులు హెచ్చరించడంతో మద్యం సిండికేట్ దిగివచ్చింది. మొదట్లో ప్రత్యేక ధరను అమలు చేసినా కేసులకు జడిసి పాత పద్దతిలోనే మద్యం విక్రయాలకు ఓకే చెప్పారు. మద్యం సిండికేట్ దిగివచ్చి ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయిస్తుండటంతో మందు బాబుల జేబులకు చిల్లు పడటం ఆగిపోయింది. -
బేరం కుదిరింది!
► మద్యం మాఫియా, ► ఎక్సైజ్ అధికారుల మధ్య ఒప్పందం ► సయోధ్య కుదిర్చిన అధికార పార్టీ నేత ► పెరిగిన మద్యం ధరలు ► సాక్షి-సాక్షి టీవీ జాయింట్ ఆపరేషన్‌లో వెల్లడి సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలో మద్యం సిండికేట్ హవా మళ్లీ మొదలైంది. ఉన్నతాధికారుల మధ్య విభేదాలు సద్దుమణగడంతో బాటిల్ ధర పెరిగింది. బాటిల్‌పై రూ.5 పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అటు మద్యం సిండికేట్‌కు, ఇటు అధికారులకు మధ్య అంగీకారం నేపథ్యంలోనూ బాటిల్ ధర పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం షాపుల యజమానులు అందరూ కలిసి ధర పెంచినట్టు స్వయంగా షాపులో పనిచేసే సిబ్బందే చెబుతున్నారు. సాక్షి- సాక్షి టీవీ నిఘాలో ఈ అంశం స్పష్టంగా వెల్లడయ్యింది. మొన్నటివరకు ధర పెంచుకునేందుకు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు అడ్డొచ్చాయి. అధికార పార్టీ నేతలు సర్దిచెప్పడంతో బేరం కుదిరి... బాటిల్ ధర పెరిగింది. జిల్లావ్యాప్తంగానూ ఇదే తీరు జిల్లావ్యాప్తంగా మద్యం సిండికేట్ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్లలో ఏకంగా బాటిల్‌పై రూ. 10 పెంచి మరీ విక్రయిస్తున్నారు. అక్కడి అధికార పార్టీ నేతల అండదండలతో దీనికి అడ్డులేకుండా పోయింది. తాజాగా కర్నూలులో బాటిల్‌పై రూ. 5 పెంచుకునేందుకు మొదట్లో జరిగిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇద్దరు అధికారుల మధ్య నెలకొన్న విభేదాలతో రచ్చ అయ్యింది. ఏకంగా ఒక షాపును మరో అధికారి పట్టించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యనేత సోదరుడు రంగప్రవేశం చేసి..సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా బాటిల్‌పై రూ.5 పెరిగింది. ఎంఆర్పీ ఉల్లంఘన షురూ అయ్యింది. మరోవైపు సీజ్ అయిన షాపునకు వేసిన పెనాల్టీని..మద్యం సిండికేట్లు అందరూ కలిసి కట్టినట్టు సమాచారం. ఫలితంగా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చి షాపును సీజ్ చేసినప్పటికీ కేవలం పెనాల్టీతో సరిపుచ్చుకుని.. షాపు యథావిధిగాా ప్రారంభమయ్యింది. విచిత్రమేమిటంటే.. ఈ షాపులో కూడా యథావిధిగా ఎంఆర్పీ ఉల్లంఘన జరగడం. సాక్షి నిఘాతో బట్టబయలు మద్యం సిండికేట్ల వ్యవహారాన్ని బయటపెట్టేందుకు సాక్షి-సాక్షి టీవీ నిఘా పెట్టింది. జిల్లాలో పలు షాపులను బుధవారం రాత్రి సాక్షి బృందం స్వయంగా వెళ్లి బాటిల్ ధర ఎంత అంటూ వాకబు చేసింది. ఈ సందర్భంగా యజమానులందరూ కలిసి ధర పెంచారని షాపులో పనిచేస్తున్న సిబ్బంది కుండబద్దలు కొట్టారు. ఒక షాపులో పనిచేసే సిబ్బంది ఏకంగా ధరలు పెంచకపోతే ఓనర్ కథ ముగుస్తుందంటూ మాట్లాడటం గమనార్హం. ‘సాక్షి’ టీంకు, మద్యం షాపు సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ ఇదీ.. షాపు నెంబరు 1: సాక్షి: రాయల్ స్టాగ్ క్వార్టర్ ఎంత అన్న? షాపు బాయ్: రూ. 155 అన్న. సాక్షి: ఎంఆర్పీ ఎంత అన్న బాయ్: రూ. 150. సాక్షి: ఎందుకు రూ. 5 ఎక్కువన్న. ఎవరు డిసైడ్ చేశారు. బాయ్: ఎక్సైజ్ వాళ్లు, సిండికేట్ వాళ్లు....వైన్‌షాపు ఓనర్స్ అందరూ మాట్లాడుకుని బాటిల్‌పై రూ.5 పెంచినారు. షాపు నెంబరు 2: సాక్షి: రాయల్ స్టాగ్ హాఫ్ ఎంత? బాయ్: రూ. 310 అన్న. ఎంఆర్పీ కన్న ఎక్కువ. సాక్షి: ధర ఎవరు పెంచారు. బాయ్: ప్రభుత్వమే ఎక్కువ చేసింది. మాదేమీ ఇది సొంత షాపు కాదు. మేం పనిచేసే వాళ్లమే. ఏదైనా రూ. 5 ఎక్కువే. -
మద్యం ధరలకు రెక్కలు
కర్నూలు: బెల్టు దుకాణాల నిర్మూలన వ్యాపారుల రాబడిపై ప్రభావం చూపనుండటంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. కొత్త మద్యం విధానం ప్రారంభమై వారం రోజులు కూడా గడవకముందే గరిష్ట చిల్లర ధరకు మంగళం పాడారు. ఫలితంగా మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. లాభాల కోసం వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్‌గా ఏర్పడి అంతర్గత ఒప్ప ందం ప్రకారం పది శాతానికి అధికంగా సరు కు విక్రయించేలా తీర్మానించుకున్నట్లు సమాచారం. జిల్లాలో 194 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో 180 దుకాణాలకు లెసైన్సులున్నాయి. 36 బార్లు నడుస్తున్నాయి. అందులో సగానికి పైగా రాజకీయ నాయకులు, వారి అనుచరుల ఆధ్వర్యంలో నడుస్తున్నవే. పార్టీలు వేరైనా మద్యం వ్యాపారంలో మాత్రం అన్ని పార్టీల నేతలు పరోక్షంగా పాత్రధారులుగా ఉన్నారు. లక్కీడ్రాలో దుకాణాలు దక్కించుకున్నవారికి, ఎక్సైజ్ అధికారులకు మధ్య తాత్కాలిక ఒప్పందంలో భాగంగా ధరలు పెంచి విక్రయాలు జరుపుతున్నట్లు చర్చ జరుగుతోంది. పెట్టిన పెట్టుబడులపై లాభాలను రాబట్టేందుకు ప్రతి క్వాటర్ సీసాపై గరిష్ట చిల్లర ధరకు అదనంగా రూ.10 పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా మద్యం సామ్రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్న కర్నూలు సిండికేట్ మద్యం వ్యాపారులకు అండగా నిలిచింది. అధికార పార్టీ బలంతో మద్యం వ్యాపారులనంతా ఏకతాటిపైకి తీసుకొచ్చి ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇందుకోసం స్టేషనరీ ఖర్చు పేరుతో వచ్చిన ఆదాయంలో పది శాతం ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు రూపంలో ముట్టజెప్పే విధంగా ఒప్పందం కుదిరినట్లు వినికిడి. ఎంఆర్పీకే మద్యం విక్రయాలు జరపాలని నిబంధన ఉన్నా మందు బాబుల నుంచి అదనంగా గుంజడానికి వ్యాపారులు ఎక్కడికక్కడ సిండికేట్‌గా ఏర్పడ్డారు. కర్నూలు నగరంతో పాటు గూడూరు, కోడుమూరు, సి.బెళగల్, డోన్ ప్రాంతాల్లో గరిష్ట చిల్లర ధరపై(ఎంఆర్పీ) క్వాటర్ బాటిల్ రూ.10 అదనంగా విక్రయాలు జరుపుతున్నారు. ఫుల్‌బాటిల్ రూ.40 నుంచి రూ.60 వరకు ఎక్కువ ధరతో విక్రయాలు జరుపుతున్నారు. సామాన్యులు సేవించే చీఫ్ లిక్కర్, బ్యాగ్‌పైపర్, రాయల్ తదితర మద్యం క్వాటర్ బాటిల్ ధర రూ.75 ఉండగా రూ.85కు విక్రయిస్తున్నారు. అలాగే ఎంసీ విస్కీ, ఇంపీరియల్ బ్లూ, మాన్షన్ హౌస్ గరిష్ట చిల్లర ధర రూ.110 ఉండగా రూ.120 నుం చి రూ.130 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. బ్రాండెడ్‌కు బదులుగా కమిషన్ ఎక్కువగా ఇచ్చే కంపెనీలకు సంబంధిం చిన మద్యాన్ని మాత్రమే అందుబాటు లో ఉంచి లాభాలు పొందుతున్నారు. జిల్లాలో అన్ని దుకాణాల ద్వారా సగటున రోజుకు రూ.2 కోట్లపైనే వి క్రయాలు జరుగుతున్నాయి. కొత్త మద్యం విధా నం ఈ నెల 1న అమల్లోకి వచ్చింది. ఐదు రోజుల వ్యవధిలో రూ.18.87 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.