'బెల్టు షాపులపై బాబు డ్రామాలాడుతున్నారు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ....బెల్టు షాపుల విషయంలో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
టీడీపీ నేతలు ప్రతి గ్రామంలో బెల్టు షాపులు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతోనే దుర్గేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే దుర్గేశ్ మృతిచెందాడని ఆరోపిస్తూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం దుర్గేశ్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించేంత వరకు పోస్టుమార్టం నిర్వహించనీయమని ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.