ఊరూరా బెల్టుషాపులు
నెల్లూరు(పొగతోట): ‘నేతిబీరకాయ’ చందంలా ఉంది ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణం. నేతిబీరకాయలో నెయ్యి లేనట్టే తారురోడ్ల నిర్మాణంలో నాణ్యత కనిపించడంలేదు. దీంతో రోడ్లు నాలుగు రోజులకే దెబ్బతింటున్నాయి. ఫలితంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం ‘రోడ్ల’పాలవుతోంది. జిల్లాలో 3,277 కిలోమీటర్ల పరిధిలో ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి. వీటి నిర్వహణకు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో రూ.600 కోట్ల నిధులతో సుమారు 60కి పైగా ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఇవి కాక మరో రూ.150 కోట్ల పనులను పెండింగ్‌లో పెట్టారు.
పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో కోట్లు ఖర్చు చేసి తారురోడ్లు నిర్మిస్తున్నారు. అధికారుల సూళ్లూరుపేట : సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజే బెల్టుషాపులను రద్దు చేస్తున్నట్లు నాలుగో సంతకం చేయడంతో మహిళలు సంతోషిం చారు. ఇక పల్లెల్లో మద్యం బెల్టుషాపులతో గొడవలుండవని భావించారు. అ యితే ఆర్భాటంగా సంతకం చేసిన చంద్రబాబు ఆ నిర్ణయం అమలు విషయా న్ని గాలికి వదిలేయడంతో ఊరూరా బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయి. అదనంగా మద్యం డోర్ డెలివరీ విధానం అమలులోకి వచ్చింది.
ఇదంతా ఎక్సైజ్ అధికారులకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం బె ల్టుషాపుల కారణంగా పల్లెల్లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. రోజంతా కష్టం చేసిన వారిలో ఎక్కువ శాతం మంది సాయంత్రానికి తమ సంపాదనను బెల్టుషాపుల్లో జమ చేస్తున్నారు. అంతటి తో ఊరుకోకుండా మద్యం మత్తులో గొడవలకు దిగుతున్నారు. ఈ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలోనే తాను అధికారంలోకి వస్తే బెల్టుషాపులను రద్దు చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన మాటలను నమ్మిన మహిళలు ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారు. హామీని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించిన చంద్రబాబు సంతకానికే పరిమితమయ్యారు. బెల్టుషాపులను పూర్తిగా రద్దు చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో మద్యం వ్యాపారులకు అనుకూలంగా మారింది.
సూళ్లూరుపేట ప్రాంతంలో గతంలో మాదిరిగానే బెల్టుషాపులు కొనసాగిస్తున్నారు. అయితే విక్రయాల విధానంలో కొంత మార్పులు తెచ్చారు. గతంలో కూల్‌డ్రింక్ షాపులు, బొం కుల్లో విక్రయాలు జరపగా ప్రస్తుతం కొంత రహస్యం చేశారు. రహస్య ప్రదేశాల్లో నిల్వలు పెట్టి ఫోన్ ద్వారా అర్డర్లు తీసుకుని సప్లయి చేస్తున్నారు. పలా నా చోట ఉన్నాం మద్యం కావాలంటే..బెల్టుషాపు నిర్వాహకుడే వెళ్లి డెలివరీ ఇస్తున్నాడు. ఈ వ్యాపారులకు సూళ్లూరుపేటలోని పలు షాపుల యజమాను లు జీపులు, ఆట్లో మద్యం సరఫరా చేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నెల మామూళ్లు తీసుకునే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మద్యం షాపులతో ఇబ్బందులు: సూళ్లూరుపేటలోని తహశీల్దార్ కార్యాలయం పక్కనే మూడు దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతంలోనే మీ సేవ కేంద్రం ఉంది. వివిధ పనుల మీద ఈ ప్రాంతానికి నిత్యం పెద్దసంఖ్యలో మహిళలు, విద్యార్థులు వస్తుంటారు. కోళ్లమిట్ట, ఇసుకమిట్టకు ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగించాలి. మద్యం షాపుల కారణంగా అటుగా వెళ్లాలంటేనే మహిళలు హడలిపోతున్నారు. షాపుల ఏర్పాటుపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.