‘బెల్టు’ తీస్తున్నారు! | special focus on belt shops | Sakshi
Sakshi News home page

‘బెల్టు’ తీస్తున్నారు!

Published Wed, Mar 12 2014 2:28 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

special focus on belt shops

ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లో బెల్టుషాపులు ఎన్నికల సమయంలో కాసులు కురిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామాల్లోని బెల్టుషాపులు తొలగించాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ము న్సిపల్, సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేసేం దుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నే పథ్యంలో పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు వాటిని నిరోధించేందుకు దాడులు ము మ్మరం చేశారు. పదిరోజులు గా వ్యవధిలో ఈసీ ఆదేశాలతో ఆబ్కారీ అధికారులు, పోలీసులు బెల్టుషాపులపై దాడులు నిర్వహిస్తున్నారు.

 నోటిఫికేషన్ మొదలు..     ఫలితాలు వచ్చే వరకు..
 ఎన్నికలంటేనే మద్యం, డబ్బుల హవా కొనసాగుతుంది. నోటిఫికేషన్ వెలువడింది మొదలు నామినేషన్లు, ప్రచారం, పోలింగ్, ఫలితాలు వచ్చేంత వరకు పోటీలో ఉన్న అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తారు. ప్రస్తుతం మున్సిపల్, సార్వత్రిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లాలో యథేచ్ఛగా డబ్బులు, మద్యం పంపిణీ చేసేందుకు నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. జిల్లాలో 147 మద్యం దుకాణాలు, 22 బార్లు, నాలుగు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి.

అధికారికంగా అనుమతి పొందిన ఒక్కో మద్యం దుకా ణం పరిధిలో కనీసం 5నుంచి 10వరకు బెల్టు దుకాణా లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జిల్లాలో సుమారు 2 వేల వరకు బెల్టు దుకాణాలు ఉండే అవకాశాలు ఉన్నా యి. మండల కేంద్రాల్లోని దుకాణాల్లో మద్యాన్ని కొనుగోళు చేసి గ్రామాల్లోని బెల్టు దుకాణాల్లో విక్రయిస్తుంటా రు. వీటి నిర్వహణకు సంబంధించి ఎక్సైజ్, పోలీసు శా ఖ అధికారులు మామూలుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈసీ ఆదేశాల నేపథ్యంలో బెల్టుషాపులపై దాడులు చేయక తప్పడం లేదు. జిల్లా సరిహ ద్దు ప్రాంతాల్లో మహారాష్ట్ర నుంచి దేశీదారు, అక్రమ మ ద్యం ఎక్కువగా రవాణా అవుతోంది. వీటి నిర్మూలనకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ మాత్రం నామమాత్రంగానే చేస్తున్నట్లు సమాచారం. దీంతో సరిహద్దు ప్రాంతాలు దాటి గ్రామాల్లోకి విచ్చలవిడిగా అక్రమ మద్యం రవాణా అవుతున్నట్లు సమాచారం.

 నాయకులవే ఎక్కువ..
 జిల్లాలో అధిక శాతం మద్యం దుకాణాలు ప్రజాప్రతినిధులు, ఇతర నాయకుల చేతుల్లో ఉన్నాయి. దుకాణాల ద్వారా వీరికి వచ్చే ఆదాయంతో పాటు ఒక్కో బెల్టుదుకాణం నుంచి గుడ్‌విల్ రూపంలో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున్న డబ్బులు అందుతున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి వీరి మద్యం దుకాణాల నుంచే అక్కడికి మద్యం సరఫరా అయ్యేలా చేస్తున్నట్లు సమాచారం. మద్యం బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ రేటు కంటే అధిక ధరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో బెల్టు దుకాణాలు విచ్చవిలవిడిగా సొమ్ము చేసుకుంటున్నాయి. దాదాపు మూడు నెలలపాటు ఎన్నికల జాతర ఉంటుంది. దీంతో అర్ధరాత్రి మందు అందుబాటులో ఉండే విధంగా పల్లెల్లో నిల్వలకు తెర తీశారు.

 జిల్లా కేంద్రం చుట్టూ బెల్టు దుకాణాలే..
 జిల్లా కేంద్రంలోని కూతవేటు దూరంలోని పల్లెల్లో అక్ర మ మద్యం ఏరులై పారుతోంది. జిల్లా సరిహద్దు ప్రాం తాలతోపాటు జిల్లా కేంద్రానికి దగ్గర పల్లెల్లో, జిల్లా కేం ద్రంలో అక్రమ మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి. జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న మావల, బట్టిసావర్గాం, అనుకుంట, కచ్‌కంటీ, రాంపూర్, పొచ్చర, భీంసరీ, జం దాపూర్, గోట్కూరి, కజ్జర్ల తదితర గ్రామాలతోపాటు, ఆదిలాబాద్ పట్టణంలోని వడ్డరకాలనీ, శాంతినగర్, ఖా నాపూర్, ఖుర్షీద్‌నగర్, మహాలక్ష్మీవాడ, భాగ్యనగర్, ఇం ద్రనగర్ తదితర కాలనీల్లో బెల్టుషాపుల నిర్వహణ చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రానికి మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పట్టుకున్న కేసుల్లో మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు తరలిస్తున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. వీటి గురించి అధికారులు తెలిసినప్పటికి చెక్‌పోస్టులు ఉన్న చోటే తప్ప గ్రామాల్లోని మద్యం విక్రయాలపై ఎటువం టి చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు వినిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement