సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వం 108 కోట్ల రూపాయలు ఆదా చేసిందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గతంలో మద్యం షాపులు రెంట్‌కు తీసుకున్నామని, ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీంతో ఆయన మద్యం షాపులపై రివర్స్ టెండరింగ్ వేయాలని ఆదేశించారన్నారు. సీఎం జగన్ ఆదేశం మేరకు మద్యం దుకాణాలపై రివర్స్ టెండరింగ్ వేశామన్నారు. (చదవండి: డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు)
ఈ నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బెల్టు షాపుల రెంట్‌పై దాదాపు 108 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలాయని వెల్లడించారు. 2019-20లో షాపులకు 671.04 కోట్ల రూపాయల రెంటు చెల్లించామని చెప్పారు. అదే రివర్స్ టెండరింగ్ ద్వారా 2020-21 ఏడాది కేవలం 562.2 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించామని తెలిపారు. అంటే దాదాపు 16.22 శాతం ప్రభుత్వ నిధులు ఆదా చేశామన్నారు. అంతేగాక మద్యపానం తగ్గించడం వల్ల రాష్ట్రంలో నేరాలు ప్రమాదాలు బాగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లు)
Comments
Please login to add a commentAdd a comment