
సాక్షి, దువ్వూరు : ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అన్నివర్గాల ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి వెల్లువెత్తుతున్నారు. ఏడోరోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను జొన్నవరంలో సోమవారం ఉదయం పలువురు మహిళలు కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను విన్నవించుకున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్ట్ షాపులు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని మహిళలు.. వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. మహిళల ఆవేదన పట్ల స్పందించిన వైఎస్ జగన్... వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బెల్ట్ షాపులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మూడు దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని ఆయన తెలిపారు.
ఈరోజు ఉదయం వైఎస్ జగన్ ఇక్కుపల్లి జంక్షన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తనను కలిసేందుకు వచ్చినవారిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు కదిలారు. ఎన్కుపల్లి, జిల్లెల, కానగూడూరు, ఇడమడక మీదగా చాగలమర్రి వరకూ యాత్ర కొనసాగనుంది.