శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలం ప్రహ్లాదపురంలో పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
శ్రీకాకుళం(పాతపట్నం): శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలం ప్రహ్లాదపురంలో పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా బెల్టు షాపులలో పోలీసులు ముమ్మర తనిఖీలు జరిపారు.
ఈ తనిఖీల్లో 15 లక్షల విలువ చేసే టేకు దుంగలు, బెల్లు షాపులలో అక్రమంగా నిల్వ ఉంచిన 15 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.