జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ | Belt Shop Tenders Held Under Joint Collector In Vijayawada | Sakshi
Sakshi News home page

జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ

Published Wed, Aug 21 2019 4:46 PM | Last Updated on Wed, Aug 21 2019 5:13 PM

Belt Shop Tender Held Under Joint Collector In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎక్సైజ్‌ శాఖ ముందుకు వెళ్తుంది. రాష్ట్రంలో మద్యపాన నిషేదం అమలును ముమ్మరం చేస్తూ..నూతన ఎక్సైజ్‌ పాలసీకి  జిల్లాలో తొలి అడుగులు పడ్డాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబోయే మద్యం షాపు రెంట్ల భవనాలు, ట్రాన్స్‌పోర్టు, ఫర్నిచర్‌ల టెండర్లకు ఎక్సైజ్‌ శాఖ పిలుపునిచ్చింది. దీంతో జిల్లాలోని మొత్తం 294 బెల్టు షాపులకు గాను, 250 షాపులకు సంబంధించిన టెండర్లను జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత పర్యవేక్షణలో ఎక్సైజ్‌ అధికారులు తెరిచారు. ఈ సందర్భంగా అధిక రెంట్లు కోడ్‌ చేసిన భవన యజమానులతో పాటు ఒక్కొక్క టెండరుదారుడితో మాధవీలత చర్చించారు. ఈ క్రమంలో పాత తరహాలోనే అద్దె చెల్లిస్తామని చెప్పి టెండర్‌ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement