
సాక్షి, వేంసూరు(ఖమ్మం) : అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తొలగించాలని అనేకసార్లు ఎక్సెజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో గ్రామంలోని మహిళలందరూఏకమై బెల్ట్ షాపును తొలగించారు. మండల పరిధిలోని జయలక్ష్మీపురంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులపై సోమవారం మహిళలు దాడులు నిర్వహించారు. మద్యంసీసాలను ధ్వంసం చేశారు. బెల్ట్ షాపులు తొలగించాలని నినాదాలు చేస్తూ సోమవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. జయలక్ష్మీపురం పంచాయతీ ఆంధ్రా సరిహద్దులో ఉందని, అక్కడ మద్యపాన నిషేధం అమలు కావడంతో, గ్రామంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు కిరాణా షాపునకు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానం వల్ల యువత పెడదోవ పట్టడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా బెల్ట్ షాపులను పూర్తి తొలగించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment