womens angry
-
బెల్ట్ షాపులపై మహిళల దాడి
సాక్షి, వేంసూరు(ఖమ్మం) : అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తొలగించాలని అనేకసార్లు ఎక్సెజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో గ్రామంలోని మహిళలందరూఏకమై బెల్ట్ షాపును తొలగించారు. మండల పరిధిలోని జయలక్ష్మీపురంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులపై సోమవారం మహిళలు దాడులు నిర్వహించారు. మద్యంసీసాలను ధ్వంసం చేశారు. బెల్ట్ షాపులు తొలగించాలని నినాదాలు చేస్తూ సోమవారం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. జయలక్ష్మీపురం పంచాయతీ ఆంధ్రా సరిహద్దులో ఉందని, అక్కడ మద్యపాన నిషేధం అమలు కావడంతో, గ్రామంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు కిరాణా షాపునకు వెళ్లాలన్నా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానం వల్ల యువత పెడదోవ పట్టడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా బెల్ట్ షాపులను పూర్తి తొలగించాలని కోరారు. -
డ్వాక్రా మహిళలకు కోర్టు నోటిసులు
-
బెల్టు తీసిన మహిళలు
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: గిరిజన గ్రామాల్లో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ గిరిజన మహిళలు, యువకులు ఉద్యమబాట పట్టారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి రెడ్డిగణపవరం గ్రామంలో మద్యం అమ్మకాలపై కన్నెర్ర చేశారు. గ్రామానికి చెందిన గిరిజన మహిళలు, అల్లూరి సీతారామరాజు యూత్ సభ్యులు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి అక్కడ లభించిన మద్యం సీసాలను తీసుకుని గ్రామాల నడుబొడ్డున వాటిని పగలకొట్టారు. మూడు ప్రదేశాల్లో సుమారు 30 సీసాలు తమకు లభించాయని మహిళాసంఘం నాయకురాలు గుండి దుర్గ, దారి బజారమ్మలు తెలిపారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు లేకుండా చేయాలని మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రీపగలు కష్టపడి పనిచేసిన డబ్బులు కుటుంబ యజమానులు మద్యం కోసం తరలిస్తున్నారని దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని తెలిపారు. పండుగలు వస్తున్న తరుణంలో మరింత గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నందున గ్రామాల్లో మద్యాన్ని నివారించేందుకు పూనుకున్నామని చెప్పారు. గ్రామాల్లో మద్యం అమ్మితే మరిన్ని దాడులు చేయడంతో పాటు అమ్మకాలు చేసేవారిని పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కట్టం సావిత్రి, పూనెం వేణి, యువకులు మల్లేష్, రమేష్, పవన్, కోటి, రమణ, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
‘ఖాకీ’ కాటు !
వరంగల్ క్రైం : శాంతిభద్రతలను పరిరక్షించి ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు అనైతికంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విని పిస్తున్నాయి. వివిధ కేసుల్లో నేరస్తులను పట్టుకుని శిక్ష పడేలా చేస్తున్న అధికారులు కొందరు ఉండగా.. మరికొందరు ధనార్జనతోపాటు లైంగిక వాంఛను తీర్చుకుంటూ డిపార్ట్మెంట్ కు అప్రతిష్టను తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రివేళలో పెట్రోలింగ్ పేరిట కంటికి కనపడిన మహిళలు, యువతులను బెదిరింపులకు పాల్పడుతూ లొంగ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నేను పోలీస్‌ను.. నాకు అడ్డు చెబితే.. నీ సంగ తి తేలుస్తా..!’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తు న్నట్లు సమాచారం. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. కారు కనిపించే సరికి.. మార్చిలో నగర సమీపాన ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం ఆరురోజులపాటు ఓ వేడుకను పురస్కరించుకుని రాత్రి, పగలు ఉత్సవాలు నిర్వహించింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే కొందరు విద్యార్థులు తమ ప్రేమికులను పిలిపించుకున్నారు. ఈ క్రమంలో సదరు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవే ట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న తన ప్రేమి కుడిని కాలేజీకి పిలిపించుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఓ రోజు రాత్రి 12 గంటల తర్వాత కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగానే విద్యార్థిని తన ప్రియుడు తీసుకొ చ్చిన కారులో బయటకు వెళ్లింది. రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసి కార్లో ఇద్దరు మా ట్లాడుకుంటున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు అధికారికి కారు కంటపడింది. వెంటనే పార్కింగ్ చేసిన కారు దగ్గరికెళ్లి డోర్ తీశాడు. యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని చూసేసరికి ప్రేమికులకు ఒక్కసారిగా చెమటలు పుట్టాయి. సదరు అధికారి ఇద్దరి సెల్ఫోన్లు గుంజుకుని తన డ్రైవర్‌కు అప్పగించాడు. తర్వాత యువకుడిని కారు నుంచి కొంచెం దూరం తీసుకెళ్లి పోలీసు లంటే ఏంటో.. తాను ఇప్పుడు ఏం చేయవచ్చో.. ఎలాంటి కేసులు పెట్టవచ్చో.. ఇద్దరి భవిష్యత్ ఏం అవుతుందో చెబుతూ నానా రకాల బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడిన యువకుడు ఆయన కాళ్లు పట్టుకుని బతిమిలా డినట్లు సమాచారం. తాను చెప్పినట్లు చేస్తే.. వదిలేస్తానని అనడంతో ఓకే అన్నాడు. తర్వాత ఏం జరిగిందో... తెలియదు.. రెండున్నర గంటల తర్వాత విద్యార్థిని ప్రత్యక్షం ఆ రోజు రాత్రి యువకుడికి సినిమా చూపించి న పోలీసు అధికారి సమీపంలో ఉన్న ఓ పెట్రో ల్ బంకులో వారి కారును పార్కింగ్ చేయించిన ట్లు తెలిసింది. తర్వాత అతడిని మరో పెట్రోల్ బంకులో వేచి ఉండాలని ఆదేశించాడు. సదరు విద్యార్థినిని తన వాహనంలో ఎక్కించుకుని విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని విశ్రాంతి గదికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వర కు విచారణ పేరిట ఆమెను ప్రైవేట్ కస్టడీలో ఉంచుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండున్నర గంటల తర్వాత యువకుడికి.. విద్యార్థినిని అప్పగించి ఈ విషయం ఎక్కడ చెప్పినా మీ ఇద్దరి భవిష్యత్ నాశనమవుతుందని హెచ్చరిం చి వదిలేశాడు. ఉదయం వచ్చి కారు తీసుకుపొమ్మని సెలవిచ్చాడు. డ్రైవర్‌తో యువకుడికి ఫోన్లు.. సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం నుంచి సదరు యువకుడికి పోలీసు అధికారి డ్రైవర్ నుంచి ఫోన్లు రావడం మొదలయ్యా యి. సార్ రూ.20 వేలు రెండు రోజుల్లో తీసుకురమ్మంటున్నాడు. లేదంటే మీ వ్యవహారం కళా శాలలో, ఇంట్లో చెప్పడంతోపాటు కేసు నమోదవుతుందని హెచ్చరించినట్లు సమాచారం. బాధితుడు డబ్బుల కోసం స్నేహితుడిని అశ్రయించాడు. దీంతో ఆ రాత్రి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి విచారణ పేరిట సదరు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఖాకీపై పలు వురు మండిపడుతున్నారు. మొదలైన విచారణ.. కాలేజీ విద్యార్థినితో అర్ధరాత్రి అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసు అధికారి వ్యవహారం అధికారుల దృష్టికి పోయినట్లు సమాచారం. పోలీసుశాఖ పరువు పూర్తిగా బజారున పడకముందే దిద్దుబాటు చర్యలో భాగంగా ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది.. అనే విషయంపై ఆ అధికారికి డ్రైవర్‌గా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి నుంచి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. బాధిత ప్రేమికులను సైతం పోలీసులు విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులు చేపడుతున్న విచారణలో ఒక్కో విషయం వెలుగు చూస్తుండడంతో ఉద్యోగ ధర్మం వదిలి పశువులాగా ప్రవర్తించిన సదరు పోలీస్ అధికారిపై చర్యలు తప్పవని తెలుస్తోంది. దారి తప్పుతున్న ఖాకీలు... ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో పోకిరీలు వారిని బెదిరించి సొమ్ము చేసుకున్న సంఘటనలు గతంలో కనిపించాయి. అయితే ప్రేమ జంటలు పోలీసుల కంటపడితే సర్వం సమర్పించుకోవాల్సిన పరిస్థితులు ఇటీవల నెలకొన్నాయి. కొంతమంది అధికారులు, సిబ్బంది ప్రవర్తనతో పోలీసుశాఖకు చెడ్డపేరు వస్తుందని పలువురు వాపోతున్నారు. కాగా, పరకాల సబ్‌డివిజన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ జంటను బెదిరించి వసూళ్లకు పాల్పడిన కొందరు పోలీసులు.. సదరు యువతిని సైతం ప్రైవేట్ కస్టడీలోకి తీసుకుని అమర్యాదగా వ్యవహరించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ సంఘటన మరిచిపోకముందే మరో అధికారి అలాంటి ఘనకార్యమే చేసి పోలీసుశాఖ పరువును బజారుకు ఈడ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుంటే.. మరోపక్క కొంత మంది అధికారులు వారిలోని కోర్కెలను తీర్చుకుంటూ చెడ్డపేరు తెస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
-
టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
ఏలూరు: తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ వీరంగం సృష్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఇల్లందుపర్రులో శుక్రవారం జరిగిన జన చైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. అయితే, తమకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలను కేటాయించాలని టీడీపీ ఎమ్మెల్యేను ఈ సందర్భంగా మహిళలు నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. గ్రామస్తులు, మహిళలపై పార్టీ కార్యకర్తలను ఉసిగొలిపి వారిని అక్కడి నుంచి నెట్టివేయించారు. ఏడాది నుంచి వేడుకుంటున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించి తమపై దౌర్జన్యానికి దిగడంపై మహిళలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వినర్ కారుమురి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.