
టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
ఏలూరు: తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ వీరంగం సృష్టించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఇల్లందుపర్రులో శుక్రవారం జరిగిన జన చైతన్యయాత్రలో ఆయన పాల్గొన్నారు. అయితే, తమకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలను కేటాయించాలని టీడీపీ ఎమ్మెల్యేను ఈ సందర్భంగా మహిళలు నిలదీశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. గ్రామస్తులు, మహిళలపై పార్టీ కార్యకర్తలను ఉసిగొలిపి వారిని అక్కడి నుంచి నెట్టివేయించారు.
ఏడాది నుంచి వేడుకుంటున్నా తమ సమస్యలు పరిష్కరించడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించి తమపై దౌర్జన్యానికి దిగడంపై మహిళలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వినర్ కారుమురి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.