జనాల్ని చితగ్గొట్టారు
జన చైతన్య యాత్ర పేరిట దాడులు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, అనుచరులు
నరసాపురం రూరల్: పోలీసుల సాయంతో మగవాళ్లను గృహ నిర్బంధం చేశారు. అనంతరం అధికార ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చెల రేగిపోరుున రౌడీలు మహిళలపై దాష్టీకానికి తెగబడ్డారు. ముగ్గురు మహిళల్ని తీవ్రంగా గాయపరిచారు. విధ్వంసం సృష్టించి.. చివ రకు అదంతా ప్రజలే చేశారంటూ తప్పుడు కేసులు బనారుుంచారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం కె.బేతపూడిలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మంగ ళవారం సాయంత్రం జన చైతన్య యాత్ర నిర్వహించేందుకు కె.బేతపూడికి చేరుకున్నా రు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మా ణాన్ని ఆ గ్రామస్తులంతా వ్యతిరేకి స్తుండటంతో ఈ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే వచ్చే సమయానికి గ్రామంలోని పురుషులందరినీ పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల పహారా నడుమ గ్రామంలో శిలా ఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఎమ్మెల్యేను నిలదీసేందుకు ప్రయత్నించగా.. మాధవ నాయుడు అనుచరులు, వారితో వచ్చిన రౌడీమూకలు పోలీసుల సమక్షంలోనే మహళలపై దాడికి తెగబడ్డారు. సుమారు అరగంట పాటు విధ్వంసం సృష్టించారు. రౌడీమూకల దాడిలో సముద్రాల సత్యవాణి, పాలి లక్ష్మి తీవ్రంగా గాయపడగా, బెల్లపు వరలక్ష్మి అనే మహిళకు స్వల్ప గాయాలయ్యారుు. గాయపడిన మహిళలను నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళలపై దాడి చేసిన రౌడీ మూక లను వదిలేసి, గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.