విజయవాడ: కృష్ణా జిల్లాలో టీడీపీ రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన ఆదివారం నూజివీడు మండలం జంగంగూడెంలో చోటుచేసుకుంది. జంగంగూడెంలో అధికార టీడీపీ చేపట్టిన జనచైతన్య యాత్ర వేదికగా టీడీపీ నేతలు వల్లభనేని భాస్కర్, పొట్లురి రవి వర్గీయులు పరస్మరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల నేతల కొట్లాటలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని నూజివీడులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.