‘ఖాకీ’ కాటు ! | Polices Miss Behave Womens | Sakshi
Sakshi News home page

‘ఖాకీ’ కాటు !

Published Mon, Apr 2 2018 8:01 AM | Last Updated on Tue, Aug 21 2018 6:02 PM

Polices Miss Behave Womens - Sakshi

వరంగల్‌ క్రైం : శాంతిభద్రతలను పరిరక్షించి ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు అనైతికంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విని పిస్తున్నాయి. వివిధ కేసుల్లో నేరస్తులను పట్టుకుని శిక్ష పడేలా చేస్తున్న అధికారులు కొందరు ఉండగా.. మరికొందరు ధనార్జనతోపాటు  లైంగిక వాంఛను తీర్చుకుంటూ డిపార్ట్‌మెంట్‌ కు అప్రతిష్టను తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రివేళలో పెట్రోలింగ్‌ పేరిట కంటికి కనపడిన మహిళలు, యువతులను బెదిరింపులకు పాల్పడుతూ లొంగ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నేను పోలీస్‌ను.. నాకు అడ్డు చెబితే.. నీ సంగ తి తేలుస్తా..!’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తు న్నట్లు సమాచారం. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. 
కారు కనిపించే సరికి..
మార్చిలో నగర సమీపాన ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాల యాజమాన్యం ఆరురోజులపాటు ఓ వేడుకను పురస్కరించుకుని రాత్రి, పగలు ఉత్సవాలు నిర్వహించింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే కొందరు విద్యార్థులు తమ ప్రేమికులను పిలిపించుకున్నారు. ఈ క్రమంలో సదరు కళాశాలలో బీటెక్‌ చదువుతున్న ఓ విద్యార్థిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవే ట్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న తన ప్రేమి కుడిని కాలేజీకి పిలిపించుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఓ రోజు రాత్రి 12 గంటల తర్వాత కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగానే విద్యార్థిని తన ప్రియుడు తీసుకొ చ్చిన కారులో బయటకు వెళ్లింది. రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పార్కింగ్‌ చేసి కార్లో ఇద్దరు మా ట్లాడుకుంటున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసు అధికారికి కారు కంటపడింది. వెంటనే పార్కింగ్‌ చేసిన కారు దగ్గరికెళ్లి డోర్‌ తీశాడు. యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని చూసేసరికి ప్రేమికులకు ఒక్కసారిగా చెమటలు పుట్టాయి. సదరు అధికారి ఇద్దరి సెల్‌ఫోన్లు గుంజుకుని తన డ్రైవర్‌కు అప్పగించాడు. తర్వాత యువకుడిని కారు నుంచి కొంచెం దూరం తీసుకెళ్లి పోలీసు లంటే ఏంటో.. తాను ఇప్పుడు ఏం చేయవచ్చో.. ఎలాంటి కేసులు పెట్టవచ్చో.. ఇద్దరి భవిష్యత్‌ ఏం అవుతుందో చెబుతూ నానా రకాల బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడిన యువకుడు ఆయన కాళ్లు పట్టుకుని బతిమిలా డినట్లు సమాచారం. తాను చెప్పినట్లు చేస్తే.. వదిలేస్తానని అనడంతో ఓకే అన్నాడు. తర్వాత ఏం జరిగిందో... తెలియదు..
రెండున్నర గంటల తర్వాత విద్యార్థిని ప్రత్యక్షం
ఆ రోజు రాత్రి యువకుడికి సినిమా చూపించి న పోలీసు అధికారి సమీపంలో ఉన్న ఓ పెట్రో ల్‌ బంకులో వారి కారును పార్కింగ్‌ చేయించిన ట్లు తెలిసింది. తర్వాత అతడిని మరో పెట్రోల్‌ బంకులో వేచి ఉండాలని ఆదేశించాడు. సదరు విద్యార్థినిని తన వాహనంలో ఎక్కించుకుని  విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని విశ్రాంతి గదికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వర కు విచారణ పేరిట ఆమెను ప్రైవేట్‌ కస్టడీలో ఉంచుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండున్నర గంటల తర్వాత యువకుడికి.. విద్యార్థినిని అప్పగించి ఈ విషయం ఎక్కడ చెప్పినా మీ ఇద్దరి భవిష్యత్‌ నాశనమవుతుందని హెచ్చరిం చి వదిలేశాడు. ఉదయం వచ్చి కారు తీసుకుపొమ్మని సెలవిచ్చాడు. 
డ్రైవర్‌తో యువకుడికి ఫోన్లు.. 
సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం నుంచి సదరు యువకుడికి  పోలీసు అధికారి డ్రైవర్‌ నుంచి ఫోన్లు రావడం మొదలయ్యా యి. సార్‌ రూ.20 వేలు రెండు రోజుల్లో తీసుకురమ్మంటున్నాడు. లేదంటే మీ వ్యవహారం కళా శాలలో, ఇంట్లో చెప్పడంతోపాటు కేసు నమోదవుతుందని హెచ్చరించినట్లు సమాచారం. బాధితుడు డబ్బుల కోసం స్నేహితుడిని అశ్రయించాడు. దీంతో ఆ రాత్రి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి విచారణ పేరిట సదరు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఖాకీపై పలు వురు మండిపడుతున్నారు.
మొదలైన విచారణ..
కాలేజీ విద్యార్థినితో అర్ధరాత్రి అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసు అధికారి వ్యవహారం అధికారుల దృష్టికి పోయినట్లు సమాచారం. పోలీసుశాఖ పరువు పూర్తిగా బజారున పడకముందే దిద్దుబాటు చర్యలో భాగంగా ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది.. అనే విషయంపై ఆ అధికారికి డ్రైవర్‌గా వ్యవహరించిన ప్రైవేట్‌ వ్యక్తి నుంచి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. బాధిత ప్రేమికులను సైతం పోలీసులు విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులు చేపడుతున్న విచారణలో ఒక్కో విషయం వెలుగు చూస్తుండడంతో ఉద్యోగ ధర్మం వదిలి పశువులాగా ప్రవర్తించిన సదరు పోలీస్‌ అధికారిపై చర్యలు తప్పవని తెలుస్తోంది. 
దారి తప్పుతున్న ఖాకీలు...
ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో పోకిరీలు వారిని బెదిరించి సొమ్ము చేసుకున్న సంఘటనలు గతంలో కనిపించాయి. అయితే ప్రేమ జంటలు పోలీసుల కంటపడితే సర్వం సమర్పించుకోవాల్సిన పరిస్థితులు ఇటీవల నెలకొన్నాయి. కొంతమంది అధికారులు, సిబ్బంది ప్రవర్తనతో పోలీసుశాఖకు చెడ్డపేరు వస్తుందని పలువురు వాపోతున్నారు. కాగా, పరకాల సబ్‌డివిజన్‌ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ జంటను బెదిరించి వసూళ్లకు పాల్పడిన కొందరు పోలీసులు.. సదరు యువతిని సైతం ప్రైవేట్‌ కస్టడీలోకి తీసుకుని అమర్యాదగా వ్యవహరించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ సంఘటన మరిచిపోకముందే మరో అధికారి అలాంటి ఘనకార్యమే చేసి పోలీసుశాఖ పరువును బజారుకు ఈడ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కోసం ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుంటే.. మరోపక్క కొంత మంది అధికారులు వారిలోని కోర్కెలను తీర్చుకుంటూ చెడ్డపేరు తెస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement