Warangal crime
-
‘ఖాకీ’ కాటు !
వరంగల్ క్రైం : శాంతిభద్రతలను పరిరక్షించి ప్రజలకు అండగా నిలవాల్సిన పోలీసులు అనైతికంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు విని పిస్తున్నాయి. వివిధ కేసుల్లో నేరస్తులను పట్టుకుని శిక్ష పడేలా చేస్తున్న అధికారులు కొందరు ఉండగా.. మరికొందరు ధనార్జనతోపాటు లైంగిక వాంఛను తీర్చుకుంటూ డిపార్ట్మెంట్ కు అప్రతిష్టను తీసుకొస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రివేళలో పెట్రోలింగ్ పేరిట కంటికి కనపడిన మహిళలు, యువతులను బెదిరింపులకు పాల్పడుతూ లొంగ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నేను పోలీస్‌ను.. నాకు అడ్డు చెబితే.. నీ సంగ తి తేలుస్తా..!’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తు న్నట్లు సమాచారం. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. కారు కనిపించే సరికి.. మార్చిలో నగర సమీపాన ఉన్న ఓ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం ఆరురోజులపాటు ఓ వేడుకను పురస్కరించుకుని రాత్రి, పగలు ఉత్సవాలు నిర్వహించింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే కొందరు విద్యార్థులు తమ ప్రేమికులను పిలిపించుకున్నారు. ఈ క్రమంలో సదరు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవే ట్ కళాశాలలో బీటెక్ చదువుతున్న తన ప్రేమి కుడిని కాలేజీకి పిలిపించుకుంది. ఉత్సవాల్లో భాగంగా ఓ రోజు రాత్రి 12 గంటల తర్వాత కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగానే విద్యార్థిని తన ప్రియుడు తీసుకొ చ్చిన కారులో బయటకు వెళ్లింది. రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసి కార్లో ఇద్దరు మా ట్లాడుకుంటున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు అధికారికి కారు కంటపడింది. వెంటనే పార్కింగ్ చేసిన కారు దగ్గరికెళ్లి డోర్ తీశాడు. యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని చూసేసరికి ప్రేమికులకు ఒక్కసారిగా చెమటలు పుట్టాయి. సదరు అధికారి ఇద్దరి సెల్ఫోన్లు గుంజుకుని తన డ్రైవర్‌కు అప్పగించాడు. తర్వాత యువకుడిని కారు నుంచి కొంచెం దూరం తీసుకెళ్లి పోలీసు లంటే ఏంటో.. తాను ఇప్పుడు ఏం చేయవచ్చో.. ఎలాంటి కేసులు పెట్టవచ్చో.. ఇద్దరి భవిష్యత్ ఏం అవుతుందో చెబుతూ నానా రకాల బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడిన యువకుడు ఆయన కాళ్లు పట్టుకుని బతిమిలా డినట్లు సమాచారం. తాను చెప్పినట్లు చేస్తే.. వదిలేస్తానని అనడంతో ఓకే అన్నాడు. తర్వాత ఏం జరిగిందో... తెలియదు.. రెండున్నర గంటల తర్వాత విద్యార్థిని ప్రత్యక్షం ఆ రోజు రాత్రి యువకుడికి సినిమా చూపించి న పోలీసు అధికారి సమీపంలో ఉన్న ఓ పెట్రో ల్ బంకులో వారి కారును పార్కింగ్ చేయించిన ట్లు తెలిసింది. తర్వాత అతడిని మరో పెట్రోల్ బంకులో వేచి ఉండాలని ఆదేశించాడు. సదరు విద్యార్థినిని తన వాహనంలో ఎక్కించుకుని విధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని విశ్రాంతి గదికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వర కు విచారణ పేరిట ఆమెను ప్రైవేట్ కస్టడీలో ఉంచుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండున్నర గంటల తర్వాత యువకుడికి.. విద్యార్థినిని అప్పగించి ఈ విషయం ఎక్కడ చెప్పినా మీ ఇద్దరి భవిష్యత్ నాశనమవుతుందని హెచ్చరిం చి వదిలేశాడు. ఉదయం వచ్చి కారు తీసుకుపొమ్మని సెలవిచ్చాడు. డ్రైవర్‌తో యువకుడికి ఫోన్లు.. సంఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం నుంచి సదరు యువకుడికి పోలీసు అధికారి డ్రైవర్ నుంచి ఫోన్లు రావడం మొదలయ్యా యి. సార్ రూ.20 వేలు రెండు రోజుల్లో తీసుకురమ్మంటున్నాడు. లేదంటే మీ వ్యవహారం కళా శాలలో, ఇంట్లో చెప్పడంతోపాటు కేసు నమోదవుతుందని హెచ్చరించినట్లు సమాచారం. బాధితుడు డబ్బుల కోసం స్నేహితుడిని అశ్రయించాడు. దీంతో ఆ రాత్రి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగ ధర్మాన్ని పక్కన పెట్టి విచారణ పేరిట సదరు యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఖాకీపై పలు వురు మండిపడుతున్నారు. మొదలైన విచారణ.. కాలేజీ విద్యార్థినితో అర్ధరాత్రి అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసు అధికారి వ్యవహారం అధికారుల దృష్టికి పోయినట్లు సమాచారం. పోలీసుశాఖ పరువు పూర్తిగా బజారున పడకముందే దిద్దుబాటు చర్యలో భాగంగా ఆ రాత్రి అక్కడ ఏం జరిగింది.. అనే విషయంపై ఆ అధికారికి డ్రైవర్‌గా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి నుంచి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. బాధిత ప్రేమికులను సైతం పోలీసులు విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులు చేపడుతున్న విచారణలో ఒక్కో విషయం వెలుగు చూస్తుండడంతో ఉద్యోగ ధర్మం వదిలి పశువులాగా ప్రవర్తించిన సదరు పోలీస్ అధికారిపై చర్యలు తప్పవని తెలుస్తోంది. దారి తప్పుతున్న ఖాకీలు... ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో పోకిరీలు వారిని బెదిరించి సొమ్ము చేసుకున్న సంఘటనలు గతంలో కనిపించాయి. అయితే ప్రేమ జంటలు పోలీసుల కంటపడితే సర్వం సమర్పించుకోవాల్సిన పరిస్థితులు ఇటీవల నెలకొన్నాయి. కొంతమంది అధికారులు, సిబ్బంది ప్రవర్తనతో పోలీసుశాఖకు చెడ్డపేరు వస్తుందని పలువురు వాపోతున్నారు. కాగా, పరకాల సబ్‌డివిజన్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ జంటను బెదిరించి వసూళ్లకు పాల్పడిన కొందరు పోలీసులు.. సదరు యువతిని సైతం ప్రైవేట్ కస్టడీలోకి తీసుకుని అమర్యాదగా వ్యవహరించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ సంఘటన మరిచిపోకముందే మరో అధికారి అలాంటి ఘనకార్యమే చేసి పోలీసుశాఖ పరువును బజారుకు ఈడ్చారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుంటే.. మరోపక్క కొంత మంది అధికారులు వారిలోని కోర్కెలను తీర్చుకుంటూ చెడ్డపేరు తెస్తున్నారు. -
దొంగ అవతారమెత్తిన ఆర్ఎంపీ
వరంగల్ క్రైం : వైద్యంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఓ ఆర్ఎంపీ దొంగగా అవతారమెత్తాడు. తన అన్నతమ్ముడిలాగే తానూ చోరీల బాటపట్టి పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి పోలీసులు రూ.9 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా కథనం ప్రకారం.. రామగుండం మండలం రామారం గ్రామానికి చెందిన రాంటెంకి రాజ్‌కుమార్ ఉరఫ్ రాజు ఆర్ఎంపీగా పనిచేస్తుండేవాడు. అతడి అన్న శ్రీనివాస్, తమ్ముడు సారయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేసేవారు. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్లో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన వారిద్దరు మే నెలలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆర్ఎంపీగా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజ్‌కుమార్ కూడా తన తమ్ముడు సారయ్యతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. ఇద్దరూ కలిసి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొంగతనాలు చేశారు. 8 తాళం వేసిన ఇళ్లలో.. మరో 10 చైన్‌స్నాచింగ్‌లు చేశారు. చోరీ సొత్తును బుధవారం వరంగల్ బులియన్ మార్కెట్లో అమ్ముకునేందుకు రాజ్‌కుమార్ రాగా సమాచారం అందుకున్న సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆది నారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.9 లక్షల విలువైన 442 గ్రాముల బంగారం, వంద గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సారయ్య పరారీలో ఉన్నాడు. -
బూచోళ్లు దొరికారు
వరంగల్ క్రైం : కాసుల కోసం కక్కుర్తిపడి కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్న కిడ్నాప్ ముఠా గుట్టురట్టరుుంది. పిల్లలను ఎత్తుకె ళుతున్న ఇద్దరు బూచోళ్లను, కొనుగోలు చేస్తున్న వ్యక్తులతోపాటు దళారీని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రెండేళ్లలోపు మగపిల్లలను టార్గెట్‌గా చేసుకుని కిడ్నాప్ చేయడం గమనార్హం. హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కిరణ్‌కుమార్‌తో కలిసి డీఎస్పీ శోభన్‌కుమార్ వివరాలు వెల్లడించారు. కోరుట్లకు చెందిన రాగుల గంగు, తమిళనాడు రాష్ట్రంలోని కంచివరం జిల్లా పల్లగూడెం గ్రామం నుంచి వలస వచ్చిన అశోక్ ఖమ్మం జిల్లా భద్రాచలంలో పూసల దండలు, బొమ్మల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో పరిచయమైన వీరిద్దరూ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనకు వచ్చారు. సంవత్సరంన్నర నుంచి భద్రాచలం దైవదర్శనానికి తల్లిదండ్రులతో వచ్చే రెండేళ్లలోపు మగపిల్లలను అపహరించేవారు. ఇలా ముగ్గురు పిల్లల భద్రాచలంలో అపహరించారు. అపహరించిన వారిలో మొదటి బాలుడిని అశోక్ తన మేనకోడలు అయిన పుష్పకు సంతానం లేని కారణంగా ఇచ్చాడు. నెల రోజుల తర్వాత భద్రాచలంలో అపహరించిన మరో బాలుడిని మెట్పల్లి మండలం గాజులపేటకు చెందిన బింగి పరంధామ్కు లక్ష రూపాయలకు విక్రయించారు. ఆ తర్వాత పరందామ్ ప్రోత్సాహంతో నాలుగు నెలల క్రితం భద్రాచలంలో మరో బాలుడిని అపహరించి అతడి ద్వారానే మెట్పల్లి మటన్వాడకు చెందిన గసిరెడ్డి మహిపాల్‌కు రూ.30 వేలకు విక్రయించారు. పరందామ్ ఆదేశాల మేరకు అశోక్, గంగు కలిసి నవంబర్ 9న రాత్రి హన్మకొండ చౌరస్తా ఏనుగులగడ్డలోని ఖాళీ ప్రదేశంలో బుగ్గలు అమ్ముకునే సంచారజాతికి చెందిన తోట కృష్ణవేణి గుడిసె వద్దకు వెళ్లారు. కృష్ణవేణి తన ఏడాదిన్నర కుమారుడితో నిద్రిస్తుండగా వారు కూడా ఆమె పక్కనే పడుకున్నారు. తెల్లవారి చూసేసరికి వారిద్దరితోపాటు కుమారుడు కనిపించకపోవడంతో కృష్ణవేణి రోదిస్తూ వెళ్లి హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కిడ్నాపర్లు ఇబ్రహీంపట్నం మండలం ఎద్దంకి గ్రామానికి చెందిన వజ్జల చిన్నయ్యకు రూ.75 వేలకు విక్రరుుంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందస్తుగా మధ్యవర్తి పరందామ్ ద్వారా రూ.50 వేలు తీసుకుని బాలుడిని అప్పగించారు. మిగతా రూ.25 వేల కోసం సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అశోక్, తన కోడలు పుష్పతో కలిసి పరందామ్ వద్దకు వెళ్లి రూ.25 వేలు అడిగాడు. అరుుతే మరో బాలుడిని తీసుకొస్తే ఈ రూ.25 వేలతో కలిపి మరో రూ.75 వేలు మొత్తం లక్ష ఇస్తాన ని చెప్పాడు. దీంతో మరో బాలుడిని అపహరించేందుకు వారు మంగళవారం ఉదయం హన్మకొండలోని లక్ష్మీపురం చేరుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న హన్మకొండ ఎస్సై బి.శ్రీనివాసరావు, ఐడీ పార్టీ కానిస్టేబుల్ వి.వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా తాము గతంలో నలుగురు పిల్లలను కిడ్నాప్ చేశామని, మరో బాలుడిని కిడ్నాప్ చేసేందుకు వచ్చినట్లు అంగీకరించారు. వారు చెప్పిన చిరునామాలకు వెళ్లి పోలీసులు వెంటనే నిందితులను, నలుగురు పిల్లలను తీసుకొచ్చారు. నలుగురు పిల్లల్లో ఒకరు కృష్ణవేణి కుమారుడు కాగా ఆమెకు అప్పగించారు. మిగతా వారి వివరాలు తెలియకపోవడంతో వారిని హన్మకొండ సీఐ కిరణ్‌కుమార్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చైర్మన్ అనితారెడ్డికి అప్పగించారు. వారిని సంరక్షణార్థం శిశుసంరక్షణ కేంద్రానికి తరలించినట్లు అనితారెడ్డి తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు గుర్తిస్తే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసి అప్పగిస్తామన్నారు. -
భక్తులు క్షేమంగా గమ్యం చేరడమే మా లక్ష్యం
వరంగల్‌క్రైం. న్యూస్‌లైన్ : మేడారం భక్తులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే పోలీసుల లక్ష్యమని రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురై మృతిచెందడంతోపాటు కొందరు అంగవైకల్యం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. రోడ్డు ప్రమాదాల నివారణకు రూరల్ ఎస్పీ తీసుకుంటున్న చర్యలను స్ఫూర్తిగా తీసుకుని తమ వంతు సహకారం అందించాలనే ఆలోచనతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ముందుకు వచ్చింది. ఇందులో భాగంగాజిల్లా విభాగం *60 వేల విలువైన బ్రీత్ అనలైజర్ పరికరాన్ని గురువారం రూరల్ ఎస్పీకి అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నర్సింగ్హోంఅసోసియేషన్,వరంగల్ విభాగం వారు జిల్లా పోలీసు కార్యాలయంలోని సిబ్బంది విశ్రాంతి భవనానికి లక్షా 50వేల రూపాయల విలువైన మం చాలు, బెడ్లను అందజేశారు. ముఖ్యంగా హైవేలపై పోలీసులు ముమ్మరంగా బ్రీత్ అనలైజర్ పరీక్షలు ని ర్వహించడం ద్వారా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించవచ్చని ఐఎంఎఫ్ సభ్యులు ఎస్పీకి సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూమేడారం జాతర సందర్భంగా భక్తులు మద్యం తాగి వాహనాలు నడపకుండాజాగ్రత్తపడాలన్నారు. జిల్లా పోలీసు యంత్రాం గానికి సహకారం అందించి న ఐఎంఏ, అప్నా సభ్యులను ఎస్పీ సత్కరించారు. కార్యక్రమంలో ఓఎస్డీ అంబర్ కిషోర్‌ఝా, రూరల్ అదనపు ఎస్పీ కె.శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ 2 సీఐ జానీనర్సింహులు, ఐఎంఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ హెచ్.సంధ్యారాణి, కార్యదర్శి డాక్టర్ కొత్తగట్టు శ్రీని వాస్, కోశాధికారి ఎల్.కృపాదానం, మాజీ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, అప్నా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నర్సింగ్‌రెడ్డి, పాస్ట్ అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.భాగ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జె.సుధాకర్‌రెడ్డి, అప్నా జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎ.శ్రీధర్, కార్యదర్శి డాక్టర్ ఎంఎస్.మూర్తి, కోశాధికారి డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, ఉపకోశాధికారి డాక్టర్ రాకేష్‌రెడ్డి పాల్గొన్నారు.