వరంగల్ క్రైం : కాసుల కోసం కక్కుర్తిపడి కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్న కిడ్నాప్ ముఠా గుట్టురట్టరుుంది. పిల్లలను ఎత్తుకె ళుతున్న ఇద్దరు బూచోళ్లను, కొనుగోలు చేస్తున్న వ్యక్తులతోపాటు దళారీని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రెండేళ్లలోపు మగపిల్లలను టార్గెట్‌గా చేసుకుని కిడ్నాప్ చేయడం గమనార్హం. హన్మకొండ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కిరణ్‌కుమార్‌తో కలిసి డీఎస్పీ శోభన్‌కుమార్ వివరాలు వెల్లడించారు.
కోరుట్లకు చెందిన రాగుల గంగు, తమిళనాడు రాష్ట్రంలోని కంచివరం జిల్లా పల్లగూడెం గ్రామం నుంచి వలస వచ్చిన అశోక్ ఖమ్మం జిల్లా భద్రాచలంలో పూసల దండలు, బొమ్మల వ్యాపారం చేసేవారు. ఈ క్రమంలో పరిచయమైన వీరిద్దరూ సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనకు వచ్చారు. సంవత్సరంన్నర నుంచి భద్రాచలం దైవదర్శనానికి తల్లిదండ్రులతో వచ్చే రెండేళ్లలోపు మగపిల్లలను అపహరించేవారు. ఇలా ముగ్గురు పిల్లల భద్రాచలంలో అపహరించారు. అపహరించిన వారిలో మొదటి బాలుడిని అశోక్ తన మేనకోడలు అయిన పుష్పకు సంతానం లేని కారణంగా ఇచ్చాడు.
నెల రోజుల తర్వాత భద్రాచలంలో అపహరించిన మరో బాలుడిని మెట్‌పల్లి మండలం గాజులపేటకు చెందిన బింగి పరంధామ్‌కు లక్ష రూపాయలకు విక్రయించారు. ఆ తర్వాత పరందామ్ ప్రోత్సాహంతో నాలుగు నెలల క్రితం భద్రాచలంలో మరో బాలుడిని అపహరించి అతడి ద్వారానే మెట్‌పల్లి మటన్‌వాడకు చెందిన గసిరెడ్డి మహిపాల్‌కు రూ.30 వేలకు విక్రయించారు. పరందామ్ ఆదేశాల మేరకు అశోక్, గంగు కలిసి నవంబర్ 9న రాత్రి హన్మకొండ చౌరస్తా ఏనుగులగడ్డలోని ఖాళీ ప్రదేశంలో బుగ్గలు అమ్ముకునే సంచారజాతికి చెందిన తోట కృష్ణవేణి గుడిసె వద్దకు వెళ్లారు.
కృష్ణవేణి తన ఏడాదిన్నర కుమారుడితో నిద్రిస్తుండగా వారు కూడా ఆమె పక్కనే పడుకున్నారు. తెల్లవారి చూసేసరికి వారిద్దరితోపాటు కుమారుడు కనిపించకపోవడంతో కృష్ణవేణి రోదిస్తూ వెళ్లి హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కిడ్నాపర్లు ఇబ్రహీంపట్నం మండలం ఎద్దంకి గ్రామానికి చెందిన వజ్జల చిన్నయ్యకు రూ.75 వేలకు విక్రరుుంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందస్తుగా మధ్యవర్తి పరందామ్ ద్వారా రూ.50 వేలు తీసుకుని బాలుడిని అప్పగించారు. మిగతా రూ.25 వేల కోసం సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అశోక్, తన కోడలు పుష్పతో కలిసి పరందామ్ వద్దకు వెళ్లి రూ.25 వేలు అడిగాడు. అరుుతే మరో బాలుడిని తీసుకొస్తే ఈ రూ.25 వేలతో కలిపి మరో రూ.75 వేలు మొత్తం లక్ష ఇస్తాన ని చెప్పాడు. దీంతో మరో బాలుడిని అపహరించేందుకు వారు మంగళవారం ఉదయం హన్మకొండలోని లక్ష్మీపురం చేరుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతుండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న హన్మకొండ ఎస్సై బి.శ్రీనివాసరావు, ఐడీ పార్టీ కానిస్టేబుల్ వి.వేణుగోపాల్‌రెడ్డి, సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా తాము గతంలో నలుగురు పిల్లలను కిడ్నాప్ చేశామని, మరో బాలుడిని కిడ్నాప్ చేసేందుకు వచ్చినట్లు అంగీకరించారు.
వారు చెప్పిన చిరునామాలకు వెళ్లి పోలీసులు వెంటనే నిందితులను, నలుగురు పిల్లలను తీసుకొచ్చారు. నలుగురు పిల్లల్లో ఒకరు కృష్ణవేణి కుమారుడు కాగా ఆమెకు అప్పగించారు. మిగతా వారి వివరాలు తెలియకపోవడంతో వారిని హన్మకొండ సీఐ కిరణ్‌కుమార్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చైర్మన్ అనితారెడ్డికి అప్పగించారు. వారిని సంరక్షణార్థం శిశుసంరక్షణ కేంద్రానికి తరలించినట్లు అనితారెడ్డి తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు గుర్తిస్తే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసి అప్పగిస్తామన్నారు.
బూచోళ్లు దొరికారు
Published Wed, Dec 3 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement