భక్తులు క్షేమంగా గమ్యం చేరడమే మా లక్ష్యం | Devotees, our goal is to reach the destination safely | Sakshi
Sakshi News home page

భక్తులు క్షేమంగా గమ్యం చేరడమే మా లక్ష్యం

Published Fri, Feb 7 2014 4:22 AM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

Devotees, our goal is to reach the destination safely

వరంగల్‌క్రైం. న్యూస్‌లైన్ : మేడారం భక్తులు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే పోలీసుల లక్ష్యమని రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురై మృతిచెందడంతోపాటు కొందరు అంగవైకల్యం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. రోడ్డు ప్రమాదాల నివారణకు రూరల్ ఎస్పీ తీసుకుంటున్న చర్యలను స్ఫూర్తిగా తీసుకుని తమ వంతు సహకారం అందించాలనే ఆలోచనతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ముందుకు వచ్చింది.

ఇందులో భాగంగాజిల్లా విభాగం *60 వేల  విలువైన బ్రీత్ అనలైజర్ పరికరాన్ని గురువారం రూరల్ ఎస్పీకి అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నర్సింగ్‌హోంఅసోసియేషన్,వరంగల్ విభాగం వారు జిల్లా పోలీసు కార్యాలయంలోని సిబ్బంది విశ్రాంతి భవనానికి లక్షా 50వేల రూపాయల విలువైన మం చాలు, బెడ్లను అందజేశారు. ముఖ్యంగా హైవేలపై పోలీసులు ముమ్మరంగా బ్రీత్ అనలైజర్ పరీక్షలు ని ర్వహించడం ద్వారా మద్యం తాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించవచ్చని ఐఎంఎఫ్ సభ్యులు ఎస్పీకి సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూమేడారం జాతర సందర్భంగా భక్తులు మద్యం తాగి వాహనాలు నడపకుండాజాగ్రత్తపడాలన్నారు. జిల్లా పోలీసు యంత్రాం గానికి సహకారం అందించి న ఐఎంఏ, అప్నా సభ్యులను ఎస్పీ సత్కరించారు.

కార్యక్రమంలో ఓఎస్‌డీ అంబర్ కిషోర్‌ఝా, రూరల్ అదనపు ఎస్పీ కె.శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ 2 సీఐ జానీనర్సింహులు, ఐఎంఎఫ్ అధ్యక్షురాలు డాక్టర్ హెచ్.సంధ్యారాణి, కార్యదర్శి డాక్టర్ కొత్తగట్టు శ్రీని వాస్, కోశాధికారి ఎల్.కృపాదానం, మాజీ అధ్యక్షుడు డాక్టర్ విజయ్‌చందర్‌రెడ్డి, అప్నా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నర్సింగ్‌రెడ్డి, పాస్ట్ అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.భాగ్యలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జె.సుధాకర్‌రెడ్డి, అప్నా జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎ.శ్రీధర్, కార్యదర్శి డాక్టర్ ఎంఎస్.మూర్తి, కోశాధికారి డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, ఉపకోశాధికారి డాక్టర్ రాకేష్‌రెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement