- కమ్మపాళెంలో మహిళల చైతన్యం
మద్యం బెల్టు తీసిన మహిళలు
Published Sat, Aug 13 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
కమ్మపాలెం(కొడవలూరు): మహిళలం తా చైతన్యమై గ్రామంలోని మద్యం బెల్టు దుకాణాలను తొలగిం చిన సంఘటన మండలంలోని కమ్మపాలెం లో శుక్రవారం చోటుచేసుకొంది. గ్రామం లో రెండు మద్యం బెల్టుదుకాణాలుండడంతో మద్యం ప్రియులు గ్రామంలోని రోడ్డు పక్కనున్న పోలేరమ్మ ఆలయం వద్ద మద్యం సేవిస్తూ గ్రామస్తులకు ఇబ్బందికరంగా మారా రు. గ్రామంలోని మహిళలు రోడ్డుపైకి రావాలంటే మందుబాబుల ఆగడాల కారణంగా ఇబ్బందిపడేవారు. ఈ సమస్యపై గ్రామస్తులంతా కలసి గురువారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసుకొని బెల్టు దుకాణాలను తొలగించాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం గ్రామంలోని కొంతమంది మహిళలు, గ్రామ పెద్దలు శుక్రవారం బెల్టు దుకాణాల వద్దకు వెళ్లి వార వద్దున్న మద్యం బాటిళ్ల స్వాధీనం చేసుకుని గ్రామంలోని ఆలయం వద్ద పగులగొట్టారు. మళ్లీ దుకాణాలు కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దుకాణదారులను హెచ్చరించారు. గ్రామస్తుల నిర్ణయానికి దుకాణదారులు కూడా కట్టుబడి దుకాణాలను మూసివేస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామంలో మద్యం అమ్మకాలకు కళ్లెం పడడంతోపాటు మందుబాబుల ఆగడాల నుంచి గ్రామస్తులకు విముక్తి లభించింది. గ్రామానికి చెందిన బెల్లం వెంకటనగేష్, ఏటూరి విజయమ్మ, కొమ్మి విజయమ్మ, వింజావళి, ఆంజనేయులమ్మ, బి. శ్రీనివాసులు, నాపా సురేంద్రనాయుడు, మాలకొండయ్య, ఆదెమ్మ, సతీష్‌బాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement