బెల్టుషాపు నిర్వహిస్తే చర్యలు | actions on belt shops says es mallareddy | Sakshi
Sakshi News home page

బెల్టుషాపు నిర్వహిస్తే చర్యలు

Published Fri, Jul 21 2017 10:32 PM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM

actions on belt shops says es mallareddy

గుత్తి: జిల్లాలో ఎక్కడైనా మద్యం బెల్టు షాపు నిర్వహిస్తే విక్రయదారుడిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు మద్యం షాపు లైసెన్స్‌ను రద్దు చేస్తామని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఇన్‌చార్జ్‌ ఈఎస్‌ మల్లారెడ్డి చెప్పారు. పట్టణంలోని ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

జిల్లాలో మొత్తం 146 మద్యం షాపులకు గానూ ఇప్పటి దాకా 133 మద్యం షాపులు ఏర్పాటు అయ్యాయన్నారు. ఒక కేవలం 13 మాత్రమే ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. గుత్తి ఎక్సైజ్‌ పరిధిలోని గుత్తిలో రెండు షాపులు, కరిడికొండలో ఒకటి ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అలాగే జిల్లాకు మొత్తం 17 బార్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో ఇప్పటిదాకా కేవలం రెండు బార్లు మాత్రమే ఏర్పాటైనట్లు చెప్పారు. కార్యక్రమంలో గుత్తి సీఐ రాజశేఖర్‌ గౌడ్, ఎస్‌ఐ ప్రసాద్‌రావు లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement