
చిత్తూరు అర్బన్: చిత్తూరు, తిరుపతి అబ్కారీ పరిధిలో 442 మద్యం దుకాణాలున్నాయి. వీటిలో 70 శాతం దుకాణాల వద్ద అనధికారిక బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్నారు. మద్యానికి బాని సైనవాళ్ల బతుకుల్ని పీల్చి పిప్పిచేస్తున్నారు. జిల్లాలో నెలకు 200 వరకు బెల్టు దుకాణాలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు చేసినా, మద్యం స్వాధీనం చేసుకున్నా..‡ ఆదాయానికి అలవాటుపడ్డ వారు ఈ వ్యాపారాన్ని మానలేకపోతున్నారు. టీడీపీకి చెందినవారికి ఉపాధి చూ పడానికే అన్నట్లు గ్రామాల్లో బెల్టు దుకాణాలు వెలుస్తున్నాయి. బెల్టు దుకాణాలపై జిల్లా ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసే సమయంలోముందస్తుగా కొందరు వ్యాపారులకు సమాచారం లీక్ చేస్తున్నారు. ఫలితంగా గ్రామాల్లో మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కేసులు తగ్గినప్పుడు అధికారులు, మద్యం దుకాణాల నిర్వాహకులకు ఫోన్లు చేసి మనుషులను పంపాలంటూ నామమాత్రపు అరెస్టులు చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
బాబువి నీటి మూటలు..
గతేడాది జూలైలో ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీలో మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను దశలవారీగా నిషేధిస్తామని, రాష్ట్రంలో ఎక్కడా బెల్టుదుకాణం లేకుండా చేస్తామని చెప్పారు. దీంతో ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు నాయుడు నెల రోజుల్లో బెల్టు దుకాణం లేకుండా చేస్తామన్నారు. అవి నీటిమూటలుగా మిగిలిపోయాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయాలు ఊపందుకోవాలంటే బెల్టు దుకాణాలు ఒక్కటే ప్రత్యామ్నాయమనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బెల్టు దుకాణాలు తీసేయడానికి ప్రభుత్వం ఇష్టపడటంలేదు. జిల్లా ఆబ్కారీ శాఖలో ఎౖMð్సజ్ సహాయ కమిషనర్, సూపరింటెండెంట్ పోస్టుతో పాటు మొత్తం 2 వేల వరకు సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకుండా ప్రభుత్వం తమపై అదనపు భారం మోపుతోందని కొందరు ఆబ్కారీ అధికారులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేళాపాళా లేదు...
టౌన్‌లో ఎక్కడ పడితే అక్కడ వేళాపాళా లేకుండా మద్యం అమ్మతా ఉండారు. ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియడంలేదు. రోడ్లపై ఉన్న చిల్లర అంగళ్లలో కూడా క్వార్టర్ బాటిళ్లు అమ్మతా ఉండారు. ఎప్పుడూ గొడవలే. రోడ్డుపై నడిచి వెళ్లాలన్నా భయంగా ఉంది. – చిట్టెమ్మ, చిత్తూరు
కుటుంబాల్లో తిండి లేదు..
మధ్య తరగతి కుటుంబాలు మద్యానికి బానిసై జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. చాలదన్నట్లు ప్రతి చిల్లర దుకా ణంలో మద్యం బాటిళ్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో చాలా కుటుంబా ల్లో మద్యానికి బానిసై ఇంట్లో వాళ్లకు తినడానికి తిండి కూడా పెట్టడంలేదు. – కళైఅరసి, ఎంపీటీసీ సభ్యురాలు,నంగమంగళం, గుడిపాల
కేసులు పెడుతున్నాం..
బెల్టు షాపులను తొలగించడానికి రోజూ ఓ ప్రణాళికతో పనిచేస్తున్నాం. కేసులు పెట్టి నిందితులను అరెస్టు కూడా చేస్తున్నాం. ఏడాదిలో ఆరు మద్యం దుకాణాల లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశాం.
– మధుమోహన్‌రావు,ఎక్సైజ్ సూపరింటెండెంట్, చిత్తూరు.
Comments
Please login to add a commentAdd a comment