ముగ్గురు విద్యార్థులు అదృశ్యం | 3 Students Missing In Chittoor | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యార్థులు అదృశ్యం

Published Fri, Oct 11 2019 8:49 AM | Last Updated on Fri, Oct 11 2019 8:49 AM

3 Students Missing In Chittoor - Sakshi

కౌశల్య, ఢిల్లీబాబు, సౌమ్య

సాక్షి, చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలో ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారంటూ వారి తల్లిదండ్రులు గురువారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ మనోహర్‌ కథనం మేరకు.. గిరింపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు వి.కౌశల్య, ఎ.ఢిల్లీబాబు, ఆర్‌.సౌమ్య దసరా సెలవులు పూర్తికావడంతో గురువారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లారు. సాయంత్రమైనా ముగ్గురు విద్యార్థులు తిరిగి ఇంటికి రాలేదు. కంగారుపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి విచారించగా.. అసలు పిల్లలు పాఠశాలకే వెళ్లలేదని తెలుసుకున్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల వివరాలు తెలిస్తే తమకు ఫోన్‌ నంబరు 94407 76705లో  సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement