
చెరువులో దూకిన మహిళలను ఒడ్డుకు చేరుస్తున్న దృశ్యం
నిడమర్రు: పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలోని పాటిదిబ్బ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటును నిరసిస్తూ మంగళవారం 20 మంది మహిళలు చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మద్యం దుకాణం అనుమతులు రద్దు చేయాలని, బ్రాందీ షాపును తొలగించాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా పత్తేపురం గ్రామ మహిళలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళనకు మహిళా సంఘాలు, వివిధ పార్టీల నేతలు మద్దతు తెలిపారు.
అయితే అటు అధికారులు, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గ్రామానికి చెందిన 20 మంది మహిళలు చేపల చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో స్థానికులు హుటాహుటిన వారిని గట్టుమీదకు తీసుకువచ్చారు. వీరిలో బొక్కా లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యులు చికిత్స చేయడంతో కోలుకుంది.
Comments
Please login to add a commentAdd a comment