రూ.106 కోట్లు తాగేశారు!
♦ గ్రేటర్ హైదరాబాద్ లో దసరాకు భారీగా మద్యం అమ్మకాలు
♦ గతేడాదితో పోలిస్తే సుమారు 13 శాతం ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: దసరా సంబురాల్లో మద్యం అమ్మకాలు చుక్కలను తాకాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.106 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో వరుసగా నాలుగురోజులు సెల వులు రావడంతో మద్యం అమ్మకాలు పెరి గాయి. హైదరాబాద్ మహానగరం పరిధిలోని 590 బార్లు, మరో 400 వరకు ఉన్న మద్యం దుకాణాలు కిటకిటలాడాయి. అమ్మకాల్లో ఐఎంఎల్ మద్యం కంటే యువత ఎక్కువగా కొనుగోలు చేసే బీర్లే ఎక్కువగా అమ్ముడయ్యా యి. మొత్తంగా గతేడాది దసరాతో పోలిస్తే ఈ సారి సుమారు 13 శాతం అధికంగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఆబ్కారీశాఖ లెక్కలు వేసింది.
రోజుకు రూ.33 కోట్లు!
దసరా సంబురాల్లో భాగంగా ఆది, సోమ, మంగళ వారాల్లో రోజుకు సగటున రూ.33 కోట్లకు పైగా మద్యం (బీర్లు, ఐఎంఎల్ కలిపి) అమ్ముడైనట్లు ఆబ్కారీశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. బుధవారం కూడా సుమా రు రూ.7కోట్లు విలువైన మద్యం విక్రయమైనట్లు లెక్కించారు. మొత్తంగా పండుగ వేడుకల కోసం ఈసారి రూ.106 కోట్ల మద్యం అమ్ముడైనట్లు అంచనా వేశారు. సాధారణంగా హైదరాబాద్‌లో రోజూ సగటున రూ.10 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరుగుతుం డగా.. పండుగ రోజుల్లో మూడున్నర రెట్లు అధికంగా అమ్మకాలు జరిగాయి.
బీరు అమ్మకాలే ఎక్కువ..
పండుగ అమ్మకాల తీరును పరిశీలిస్తే గత నాలుగు రోజులుగా హైదరాబాద్ పరిధిలో 1,31,655 కేసుల బీరు, 1,20,524 కేసుల ఐఎంఎల్ మద్యం అమ్ముడయినట్లు ఆబ్కారీశాఖ అధికారులు అంచనా వేశారు. ఐఎం ఎల్‌లో సాధారణ రకంతో పాటు ప్రీమియం బ్రాండ్లు కూడా పెద్ద మొత్తంలో అమ్ముడైనట్లు తెలిపారు. మొత్తంగా గతేడాది కంటే సుమా రు 13 శాతం అమ్మకాలు పెరిగినట్లు తెలి పారు. పండుగ వేడుకల కోసం సొంత ఊళ్లకు బయలుదేరిన వారు సైతం నగరం నలుమూలల్లో ఉన్న మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు. బార్లలో రెండు పెగ్గులు ఆర్డర్ చేస్తే.. మరో పెగ్గు ఉచితం అన్న ఆఫర్లతోనూ ఎక్కువ మద్యం వినియోగమైందన్నారు.