
మద్యాన్ని నియంత్రించకుంటే ఉద్యమం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరిక
- మద్యం అమ్మకాల నియంత్రణకు పార్టీ ఆధ్వర్యంలో దీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం నియం త్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే ఈ అంశంపై తమ పార్టీ తీవ్ర స్థారుులో ఉద్యమిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్న ప్రభు త్వం, మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగానే చూడడం మానుకోవాలన్నారు. పేదలు, యువత ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆదాయా న్ని సమకూర్చుకోవడాన్ని చూస్తూ, ప్రేక్షక పాత్ర వహించాలా అని ప్రశ్నించారు. ప్రభు త్వ విధానాలతో సమాజం విచ్ఛిన్నమవుతుం టే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమన్నా రు. ప్రభుత్వపరంగా మద్యంపై నియంత్రణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయం ఎదుట బీజేపీ సీనియర్ నేత ప్రొఫెసర్ ఎస్వీ శేషగిరిరావు శుక్రవారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షను లక్ష్మణ్ ప్రారంభించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ అబ్కారీ శాఖను ప్రొహిబిషన్ శాఖగా పేర్కొంటున్న ప్రభు త్వం మద్యం నియంత్రణకు కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదన్నారు. మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని అన్నారు. మద్యాన్ని నియంత్రించి పేద ప్రజలను కాపాడాలని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు సూచించారు.
పెన్షన్ల డబ్బులు మద్యానికే...
తెలంగాణలో మద్యాన్ని అడ్డుకోవడానికి బీజేపీ నడుం కట్టిందని శేషగిరిరావు అన్నా రు. జాతీయ ఉపాధిహామీ కూలీలు, వృద్ధా ప్య, వితంతు పెన్షన్ల డబ్బులు, సింగరేణి కార్మికులు జీతాలు.. ఇలా అధికశాతం మద్యం కోసం ఖర్చవుతున్నాయంటే అతిశ యోక్తి కాదన్నారు. ఆదాయమే పరమావధిగా మద్యం అమ్మకాలను పెంచుతూ బంగారు తెలంగాణ లక్ష్యాన్ని మరచిపోయారని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమ్మకాలపై దశల వారీగా నియంత్ర ణ చేపట్టాలన్నారు. పార్టీ నేతలు ఎన్.రామ చంద్రరావు, నాగం జనార్దన్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్,ఎం.ధర్మారావు, టి.రాజేశ్వరరావు, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, వన్నాల శ్రీరాములు, జి.ప్రేమేందర్‌రెడ్డి, కొండ్రు పుష్పలీల, ఆకుల విజయ తదిత రులు పాల్గొన్నారు.