
ఫుల్‌గా తాగేశారు!
వారం రోజుల్లో రూ. 23 కోట్ల పైగా
మద్యం విక్రయాలు గతేడాది కన్నా రూ. 2 కోట్ల 33 లక్షలు అధికం
నిజామాబాద్ క్రైం : కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. వారం రోజుల్లో రూ. 23 కోట్ల 75లక్షలకు పైగా మద్యం అమ్మకాలు సాగాయి. కొత్త సంవత్సరం సందర్భంగా మ ద్యం వ్యాపారులు భారీ స్థాయిలో మద్యాన్ని డంప్ చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ చివరి వారం రోజు ల్లో అమ్ముడైన మద్యం కంటే ఈ ఏడాది రూ. 2 కోట్ల 33 లక్షల మద్యం విక్రయాలు ఎక్కువ అయ్యాయి. ప్ర భుత్వం ఎప్పటిలాగే ఈసారి కూడా కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలకు గంట సమయం పొడిగించింది. నిత్యం మద్యం దుకాణాలు రాత్రి 10 గం టలకు, బార్లు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుండ గా, పొడిగించిన ప్రకారం మద్యం దుకాణాలకు 11 గంటల వరకు, బార్లు రాత్రి 12 గంటల వరకు అ నుమతించారు. దీంతో మందుబాబులు ఎగబడి మ ద్యాన్ని కొనుగోలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా వ్యాపారులు వారం రోజుల క్రితం నుంచే మ ద్యాన్ని డంప్ చేసుకున్నారు. మాక్లూర్ మండలం మా దాపూర్‌లో గల తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్(ఐఎంఎఫ్‌ఎల్ డిపో) నుంచి ఈ నెల 24 నుంచి 31 వరకు రూ. 23 కోట్ల 75లక్షల 89వేల 346లు మద్యం విక్రయాలు జరిగాయంటే ఏ మేరకు మద్యాన్ని డంప్ చేసుకున్నారో అర్థమవుతోంది.
విక్రయాలలో ఈసారి కూడా బీర్ల హవా కొనసాగింది. లిక్కర్ 40,642 కార్టు న్లు అమ్ముడు పోగా, బీర్లు 49,717 అమ్ముడుపోవడం గమనార్హం. గతేడాది 2015 డిసెంబర్ చివరి వారంలో ఐఎంఎల్ 30,570 కార్టున్లు, బీర్లు 44,732 కార్టున్లు విక్రయించారు. వీటి విలువ రూ. 21 కోట్ల 42 లక్షల 53వే ల 617లు జిల్లా రెండుగా విడిపోయినప్పటికి ఇంకా కామారెడ్డి జిల్లాకు ఐఎంఎల్ డిపోను ఏర్పాటు చేయలేదు. ఇప్పటికి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ ఐఎంఎల్ డిపో నుండే మద్యం కామారెడ్డి జిల్లాకు వెళ్తోంది. 2016 డిసెంబర్ 24 నుంచి 31వరకు మద్యం విక్రయాలు జరిగిన తీరు..