
అమెరికాలో మద్యం విక్రయాలపై మంత్రి పరిశీలన
సాక్షి, హైదరాబాద్: అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు గౌడ్ గురువారం న్యూయార్క్‌లోని మద్యం దుకాణాలను పరిశీలించారు. మద్యం తయారీ, విక్రయాలు జరిగే తీరును ఆయన తెలుసుకున్నారు. అమెరికాలో మద్యం ధరలు, మన రాష్ట్రంలో ధరలకు మధ్య తేడాలను పరిశీలించారు. మంత్రి వెంట ప్రత్యేకాధికారి రాజేశ్వర్‌రావు ఉన్నారు.