మళ్లీ సప‘రేటు’
జిల్లాలో మద్యం వ్యాపారుల పంథా మారింది. వ్యాపారులు మళ్లీ సిండికేటు అవతారమెత్తారు. ఏసీబీ దాడులతో కొంత కాలంగా స్తబ్దుగా వ్యవహరించిన ‘మద్యం సిండికేట్లు’ తమ రూపాన్ని మార్చుకున్నారు. ‘హోల్‌సేల్-రిటైల్’ పేరుతో కొత్త రకం వ్యాపారానికి తెరతీశారు. గతంలో ఎమ్మార్పీ ధరలను ఉల్లంఫుంచిబాహాటంగానే లిక్కర్ దందా సాగించిన వ్యాపారులు ఈ సారి కొత్తరూటు వెతుక్కున్నారు. మద్యం అమ్మకాల విషయంలో ఎక్సైజ్ శాఖ వేస్తున్న ఎత్తులను వ్యాపారులు చిత్తు చేస్తున్నారు. జిల్లా ఎక్సైజ్ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రోత్సాహంతోనే సిండికేట్లు మళ్లీ జీవం పోసుకున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. - నీలగిరి
గ్రామీణ ప్రాంతాలే టార్గెట్..
ప్రభుత్వం అమలు చేసిన కొత్త మద్యం పాలసీ వ్యాపారులకు కలిసిరాకపోవడంతో గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేశారు. దుకాణాల వద్ద బాటిల్‌పై ము ద్రించిన (ఎమ్మార్పీ) ధరలకే మద్యం అమ్ముతున్న వ్యాపారులు బెల్టుషాపులను లక్ష్యంగా చేసుకున్నారు. గ్రామానికి కనీసం రెండు లేదా మూడు బెల్టుషాపులు న డుస్తున్నాయి. దీంతో బెల్టుషాపుల నిర్వహకులు తాము కొనుగోలు చేసిన మ ద్యంపై ఎమ్మార్పీకి మించి రూ.5 నుంచి రూ.10 లు ఎక్కువ ధరకు అమ్ముతున్నా రు. గతంలో వ్యాపారులు పొందిన ఈ లాభాన్ని బెల్టుషాపులు ఆర్జిస్తుండటంతో వ్యాపారులు జీర్ణించులేకపోతున్నారు. దీంతో మండల, పట్టణ కేంద్రాల్లో వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి బెల్టుషాపులను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. హుజూర్‌నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నకిరేకల్, మునుగోడు, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సిండికేట్ జూలు విదుల్చుకుంది. కో దాడ సిండికేట్‌లో వ్యాపారుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో పోటీతత్వం ఏర్పడి ఎమ్మారీ కంటే తక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటం గమనార్హం.
దందా తీరిది..
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ గిరాకీ ఉండే బ్రాండ్లు, వ్యాపారులకు డిసౌంట్ల రూపం లో కలి సొచ్చే బ్రాండ్లను మాత్రమే డిపోల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. బెల్టుషాపులకు సరుకు అమ్మేటప్పుడు ఒక్కో బాటిల్‌పై ఎమ్మా ర్పీ మించి రూ.5 నుంచి 10 వసూలు చేస్తున్నా రు. గ్రామా ల్లో బెల్టుషాపులు వసూలు చేస్తున్న మొత్తాన్ని వ్యా పారులు దుకాణాల వద్దనే లాగేస్తున్నారు. దీంతో బెల్టుషాపుల నిర్వహకులు కూడా వ్యాపారులు వసూలు చేస్తున్న దానిపై అదనంగా రూ.5లు పెంచి గ్రామాల్లో అమ్ముతున్నారు. ఉదాహరణకు ఏదేని ఒక కంపెనీకి చెందిన క్వార్టర్ బాటిల్ ధర రూ.110లు ఉన్న వాటిపై వ్యాపారులు రూ.10లు పెంచి బెల్టు షాపులకు అమ్ముతున్నారు. దీంతో దుకాణం వద్దనే క్వార్టర్ ధర రూ.120 లకు పెరుగుతుంది. అదేవిధంగా ఆఫ్ బాటిల్ ధర రూ.215 ఉన్న వాటిపై రూ.235 లకు, ఫుల్ బాటిల్ ధర రూ.430లు ఉన్న వాటిపై రూ. 40లు పెంచి రూ.470 లకు అమ్ముతున్నారు. దీనిని రాబట్టుకునేందుకు బెల్టుషాపు నిర్వహకులు క్వార్టర్ కు రూ.5 పెంచి గ్రామాల్లో అమ్ముతున్నారు. అంటే దుకాణం వద్ద రూ.430లు ఉన్న ఫుల్ బాటిల్ ధర చేతుల మారి గ్రామానికి వచ్చే సరికి రూ.490 లకు చేరుతుంది. ఒక్కో బాటిల్‌పై నిర్ణయించిన ధర కంటే రూ.60లు ఎక్కువ అమ్ముతున్నారు. ఈ అక్రమ దందా వల్ల వ్యాపారులు, బెల్టుషాఫులు నడిపేవారు బాగుపడుతున్నా...మందుబాబుల జేబులకు చిల్లుపడుతున్నాయి.
మామూళ్లే...మామూళ్లు..
అక్రమ మద్యం వ్యాపారం, సారా విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విగ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈఎస్ పరిధిలో ప్రత్యేకంగా ఓ టాస్క్‌ఫోర్స్‌ను కూడా నియమించారు. కానీ ఈ రెండు వింగ్‌లు వ్యాపారుల అక్రమ దందాకు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిండికేట్ దందాలో అన్ని షాపుల సరుకు మొత్తం ఒకే దుకా ణం వద్ద నిల్వ ఉంచి బెల్టుషాపులకు అమ్ముతుంటారు. ఈ రెండు నిఘా వర్గాలు దాడి చేస్తే సిండికేట్ గుట్టును రట్టు చేయడం పెద్ద సమస్య కాదు. కానీ అధికారులకు తెలిసే ఇదంతా జ రుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విగ్ బెల్టుషాపులను వదిలేసి సారా విక్రయేతరల పైనే దాడులు చేస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రోద్బలంతో జరుగుతున్నట్లు వస్తున్న ఈ ప్రచారంలో సివిల్ పోలీస్‌లకు భాగం ఉన్నట్లు వినికిడి.