మద్యం దుకాణాలకు రెండో రోజూ దరఖాస్తులు నిల్
మద్యం దుకాణాలకు రెండో రోజూ దరఖాస్తులు నిల్
Published Wed, Jun 25 2014 2:31 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
విజయనగరం రూరల్: జిల్లాలోని 202 మద్యం దుకాణాలకు 2014-15 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎకై్సజ్ అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్‌కు రెండో రోజూ స్పందన కరువైంది. ప్రభుత్వం నూతన మద్యం విధానం ప్రకటించడంతో ఎకై్సజ్‌శాఖ అధికారులు జిల్లాలోని 202 మద్యం దుకాణాలు, 29 బార్లుకు సోమవారం గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తులను సర్కిల్ వారీగా స్వీకరించడానికి కలెక్టరేట్ సముదాయంలోని ఎకై్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 27 మధ్యాహ్నం మూడు గంటలతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది.
గత ఏడాది కంటే రూ.2.86కోట్ల అదనపు ఆదాయం
నూతన మద్యం విధానం ద్వారా మద్యం దుకాణాలకు పెంచిన లెసైన్స్ ఫీజుల రూపంలో గత ఏడాది కంటే అదనంగా 2.86 కోట్ల రూపాయలు ఎకై్సజ్ శాఖకు సమకూరనుంది. గత ఏడాది లెసైన్సు ఫీజుల రూపంలో ఎకై్సజ్ శాఖకు సుమారు రూ.80 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది 86 కోట్ల రూపాయల పైబడి ఆదాయం లభించనుంది. కొన్ని మద్యం దుకాణాలకు, బార్లకు లెసైన్స్ ఫీజును పెంచారు. గత ఏడాది రూ.64 లక్షలు, 32.5 లక్షలు ఉన్న దుకాణాల లెసైన్స్ ఫీజులో ఎటువంటి మార్పు చేయలేదు. కొత్తవలస సర్కిల్ పరిధిలో ఒక దుకాణానికి 64 లక్షల లెసైన్స్ ఫీజును యథావిధిగానే ఉంచారు. రూ.32.5 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాల్లో విజయనగరం డివిజన్‌లో 77, పార్వతీపురం డివిజన్‌లో 42 ఉన్నాయి.
42 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాలు జిల్లాలో 44 ఉండగా వీటి లెసైన్స్ ఫీజును రూ.45 లక్షలుగా నిర్ణయించారు. గత ఏడాది రూ.34 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న దుకాణాలు జిల్లాలో 38 ఉండగా వీటి లెసైన్స్ ఫీజును రూ.36 లక్షలుగా నిర్ణయించారు. గత ఏడాది రూ.35 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న బార్లు 26 ఉండగా వీటి ఫీజును రూ.38 లక్షలుగా నిర్ణయించారు. రూ.25 లక్షల లెసైన్స్ ఫీజు ఉన్న బార్ల లెసైన్స్ ఫీజులో ఎటువంటి మార్పులేదు. కాగా, లాటరీ ద్వారా లెసైన్స్ దక్కించుకున్న వ్యాపారులు తప్పనిసరిగా కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ మిషన్ మద్యం దుకాణాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఎకై్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీధర్ తెలిపారు. పర్మిట్ రూమ్ ఏర్పాటుకు రూ.రెండు లక్షల లెసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. లేనిపక్షంలో లెసైన్స్‌లు మంజూరు చేయడం జరగదన్నారు.
Advertisement
Advertisement