
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్–2022 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య ఎన్. కిషోర్‌బాబు తెలిపారు. జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుముతో జూలై 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
జూలై 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడానికి ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment