AP ICET
-
ఏపీ ఐసెట్‌లో 94శాతం ఉత్తీర్ణత
అనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్–2023 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. టాప్–10 ర్యాంకుల్లో తొలి తొమ్మిది ర్యాంకులు వరుసగా అబ్బాయిలే దక్కించుకోగా, 10వ ర్యాంకు అమ్మాయి కైవసం చేసుకుంది. ఏపీ ఐసెట్ ఫలితాలను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గురువారం విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ కే. హేమచంద్రారెడ్డి వర్చువల్ విధానంలో హాజరుకాగా, ఏపీ ఐసెట్ చైర్మన్, ఎస్కేయూ వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఏపీ ఐసెట్ రాష్ట్ర కన్వీనర్ పి. మురళీకృష్ణ ఫలితాలను వెల్లడించారు. ఏపీ ఐసెట్‌కు మొత్తం 49,122 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 44,343 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 41,799 (94.26 శాతం) మంది అర్హత సాధించారు. అబ్బాయిలు 24,864 మంది దరఖాస్తు చేసుకోగా.. 22,290 మంది హాజరయ్యారు. 21,041 (94.39 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే, అమ్మాయిలు 24,298 మంది దరఖాస్తు చేసుకోగా, 22,053 మంది హాజరయ్యారు. ఇందులో 20,758 (94.26 శాతం) మంది అర్హత సాధించారు. ఐదు మార్కులు అదనం ఇక ఏపీ ఐసెట్‌లో మొత్తం 2,400 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో కేవలం ఐదు అభ్యంతరాలను మాత్రమే పరగణనలోకి తీసుకుని వాటికి జవాబు రాసిన విద్యార్థులకు ఐదు మార్కులు అదనంగా కలిపినట్లు ఏపీ ఐసెట్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కన్వీనర్ పి. మురళీకృష్ణ తెలిపారు. ఉన్నత విద్యలో సంస్కరణలు.. ఫలితాల విడుదల అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ కే. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరీక్షలన్నీ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. తొలిసారి ఏపీ ఐసెట్ బాధ్యతలు ఎస్కేయూకు అప్పగించామని, యూనివర్సిటీ పటిష్టంగా నిర్వహించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం చేస్తున్న ఖర్చును నైపుణ్య, మానవవనరులల అభివృద్ధిపై పెట్టుబడిగా పరిగణిస్తోందన్నారు. జాబ్ ఓరియంటెడ్ కోర్సులు, నూతన విద్యావిధానం, ఉన్నత విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. ఫలితంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల చేరిక, ఉత్తీర్ణత శాతం పెరుగుతోందన్నారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్ ఏ. మల్లికార్జునరెడ్డి, రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య, ఏపీ ఐసెట్ కో–కన్వీనర్లు రాంగోపాల్, రఘునాథరెడ్డి, శోభాలత, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఐసెట్ 2023 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. AP ICET Results 2023 టాప్-10 ర్యాంకర్లు వీళ్లే.. 1. తపల జగదీశ్‌కుమార్‌రెడ్డి (రేణిగుంట) 2. వేదాంతం సాయివెంకట కార్తీక్ (సికింద్రాబాద్) 3. పుట్లూరు రోహిత్ (అనంతపురం) 4. చింతా జ్యోతి స్వరూప్ (విజయనగరం) 5. కానూరి రేవంత్ (విశాఖపట్నం) 6. మహమ్మద్ అఫ్తాద్ ఉద్దీన్ (పశ్చిమగోదావరి) 7. దేవరాపల్లి దేవ్ అభిషేక్ (విశాఖపట్నం) 8. జమ్ము ఫణీంద్ర (కాకినాడ) 9. పిరతి రోహన్ (బాపట్ల) 10. అంబళ్ల మహాలక్ష్మి (పశ్చిమగోదావరి) ఈ ఏపీ ఐసెట్-2023 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. మే 24, 25 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష రెండు షిఫ్ట్‌లో ఈ పరీక్షను నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. ☛ AP ICET Results-2023 డైరెక్ట్ లింక్ ఇదే (Click Here) -
ఏపీ ఐసెట్–2022: జూన్ 10 వరకు దరఖాస్తుకు గడువు
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్–2022 నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ ఆచార్య ఎన్. కిషోర్‌బాబు తెలిపారు. జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుముతో జూలై 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. జూలై 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడానికి ఉన్నత విద్యా మండలి వెబ్సైట్ cets.apsche.ap.gov.in ను సందర్శించాలని సూచించారు. -
ఎంబీఏ.. చేరికలేవి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు నానాటికీ పడిపోతున్నాయి. ఏపీ ఐసెట్–2021 కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో తొలివిడత సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు బుధవారం ప్రకటించారు. ముందుగా ఎంబీఏ విషయానికొస్తే.. ఈ విద్యా సంవత్సరం ఐసెట్ కౌన్సెలింగ్‌లో కేవలం 25 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 75 శాతం మేర సీట్లు ఖాళీగా మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం 303 ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 26 కళాశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఐసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకుంటున్నవారు అంతంతమాత్రంగానే ఉండటమే దీనికి కారణం. ఇక ప్రవేశపరీక్షలో అర్హత సాధించే వారి సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. ఉత్తీర్ణులైనవారిలోనూ కౌన్సెలింగ్‌కు హాజరవుతోంది కొందరే. ఇక సీట్లు పొందాక కళాశాలల్లో చేరేవారూ తక్కువగానే ఉంటున్నారు. -
ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, టాప్ 10 ర్యాంకులు వీరికే
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదలచేసిన ఏపీ ఐసెట్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలపల్లి రామకృష్ణ మొదటి ర్యాంకు సాధించాడు. 154 మార్కులతో టాప్‌లో నిలిచాడు. తరువాత అనంతపురం జిల్లా వ్యక్తి బండి లోకేష్ 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. నిలిచాడు. తేనేల వెంకటేష్(విజయనగరం)- మూడో ర్యాంకు, అల్లి లిఖిత్(చిత్తూరు)-నాలుగో ర్యాంకు, షైక్ సమీయుల్లా(చిత్తూరు)-ఐదో ర్యాంకు సాధించారు. చదవండి: ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల ►ఆరో ర్యాంకు- చెన్నం సాయి మణికంఠ కుమార్, గుంటూరు ►ఏడో ర్యాంకు- ఎంజేటి వైష్ణవి, చిత్తూరు ►ఎనిమిదో ర్యాంకు- సందు సోమశేఖర్, ప్రకాశం ►తొమ్మిదో ర్యాంకు- బేతి సాయి ఫణి సురేంద్ర, విశాఖపట్టణం, ►పదో ర్యాంకు- కరణం చందన, చిత్తూరు కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్-2021 ఫలితాలు విడుదలయిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. ఐసెట్ ఫలితాల్లో 38వేల మంది హాజరవగా 34,789 మంది అంటే 91.27 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం https://sche.ap.gov.in వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహించిన రెండు వారాల్లోపే రికార్డు స్థాయిలో ఫలితాలను ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ -
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
-
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఐసెట్–2021, ఏపీ ఈసెట్ 2021 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉదయం 11కి ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 34,789(91.27శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసెట్ ఫలితాల్లో 29,904 (92.53శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఐసెట్, 19న ఈసెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు అడ్మిట్ కార్డు నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి https://education.sakshi.com/ లో ఫలితాలు చూడవచ్చు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రికార్డు స్దాయిలో ఏపీ ఇంజనీరింగ్ సెట్, ఐసెట్ ఫలితాలను ప్రకటిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఐసెట్‌కు 42 వేల ధరఖాస్తు చేసుకున్నారని, 38 వేలమంది హాజరవ్వగా, 34789 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. దాదాపు 91 శాతం మంది అర్హత సాధించారని, పరీక్షా ఫలితాలని రేపటి నుంచి విద్యార్దులకి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. అదే విధంగా ఏంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకి నిర్వహించిన ఐ సెట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సెప్టెంబర్ 19న ఏపీ ఇంజనీరింగ్ సెట్ నిర్వహిస్తే పది రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ సెట్ నిర్వహించిన ఆంద్రా యూనివర్సిటీకి అభినందనలు తెలియజేశారు. త్వరలోనే ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కాగా త్వరలోనే లాసెట్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని పీజీ ప్రవేశాలకి అన్ని యూనివర్సిటీలకి కూడా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీఈసెట్ ఫలితాలు ఇంజనీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీఈసెట్–2021 (ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జేఎన్టీయూ(ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్ ఫలితాల వెల్లడి కార్యక్రమానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి హాజరు అయ్యారు. ఏపీఈసెట్‌కు మొత్తం 32,318 మంది విద్యార్థులు హాజరు కాగా, మొత్తం 13 బ్రాంచులకు గాను పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించారు. ఏపీ ఐసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి ఏపీ ఈసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి