రండి బాబూ రండి.. ఎమ్మార్పీకే మద్యం! | mrp rate sale to alcohol! | Sakshi
Sakshi News home page

రండి బాబూ రండి.. ఎమ్మార్పీకే మద్యం!

Jul 3 2015 1:27 AM | Updated on Sep 5 2018 8:43 PM

రండి బాబూ రండి.. ఎమ్మార్పీకే మద్యం! - Sakshi

రండి బాబూ రండి.. ఎమ్మార్పీకే మద్యం!

ప్రభుత్వ దుకాణంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరుగుతాయని పేర్కొంటూ పేట ఎక్సైజ్ అధికారులు మద్యం ...

చిల్లకల్లు (జగ్గయ్యపేట) : ప్రభుత్వ దుకాణంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరుగుతాయని పేర్కొంటూ పేట ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణంలో మద్యాన్ని విక్రయించారు. గ్రామంలో గురువారం రాత్రి ప్రభుత్వ మద్యం దుకాణాన్ని సీఐ వీవీవీఎన్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మండలానికి ఒక మద్యం దుకాణాన్ని కేటాయించిందన్నారు.

ఇందులో భాగంగానే ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ దుకాణంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. కొన్ని రోజులు పాటు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ మద్యం విక్రయిస్తారన్నారు. అనంతరం ఆయన కొద్దిసేపు కౌంటర్‌లో కూర్చొని మందుబాబులకు మద్యం విక్రయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ శివప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement