మత్తులో మునిగి తేలారు..
ఇక మందు ప్రియులు మద్యపానంలో ముందున్నారు. కనుమ పండగ ఆదివారం రావడంతో ఎక్సైజ్ అధికారులు ’మందు’జాగ్రత్తలు తీసుకున్నారు. ఇండెంటును బట్టి రోజువారీ వినియోగంకంటే రెండు, మూడు రెట్ల అధికంగా మద్యాన్ని ఆయా షాపులకు సరఫరా చేశారు. సాధారణంగా జిల్లాలో సగటున రూ.4 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఈ లెక్కన కనీసం రూ.8 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖలోని అనధికార వర్గాల సమాచారం.
ఆదివారం సెలవు దినం కావడం వల్ల మద్యం అలవాటున్న వారు తమ స్నేహితులు, చుట్టాలతో కలిసి మజా చేశారు. ప్రత్యేకంగా పార్టీలు ఏర్పాటు చేసుకున్నారు. మామూలు రోజులకంటే ఆదివారం మరింతగా మత్తులో మునిగితేలారు. మొత్తమ్మీద కనుమ పండగ సందర్భంగా మందు, చికెన్, మటన్‌లకు జిల్లా వాసులు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్టు స్పష్టమవుతోంది.