
తాడిపత్రి అర్బన్(అనంతపురం జిల్లా): తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త గండికోట హాజీబాషా అలియాస్ ఘోరా హాజీపై దాడి చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని కుమారుడు, జేసీ అస్మిత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెలిపారు.
ఈ నెల 23న తాడిపత్రిలోని మూడో వార్డు పర్యటనకు వెళ్లిన అస్మిత్‌రెడ్డి, ఆయన అనుచరుడు ఖాదర్‌బాషా మరికొందరు.. అదే వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. అంతటితో ఆగకుండా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో హాజీబాషా తీవ్రంగా గాయపడ్డాడు. అతని ఫిర్యాదు మేరకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డి, అనుచరులు ఖాదర్‌బాషా, ఫిల్టర్ బీడీ యజమాని అయూబ్‌తో పాటు మరో పది మంది టీడీపీ నేతలపై 147, 148, 307, 506 రెడ్‌విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
చదవండి: హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ