సాక్షి, అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి హైకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు నిషేధించిన వాహనాలను రోడ్లపై ఎలా తిప్పుతారని న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. ప్రమాదాలకుఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేసింది. మోసపూరిత పనులను అనుమతించమని తెల్చిచేప్పింది. బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. (దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై లోతుగా విచారణ)
దీంతో హైకోర్టులో మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను జేసీ కుటుంబసభ్యులు ఉపసంహరించుకున్నారు. అదే విధంగా కింది కోర్టులో బెయిల్ దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4గా చూపి రిజిస్ట్రేషన్ చేయించి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. 154 బస్సులు, లారీలను ఫోర్జరీ డాక్యూమెంట్స్‌తో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు. నాగాలాండ్ రాష్ట్రంలో కూడా పలు వాహనాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌లు కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment