సాక్షి, విజయవాడ : బీఎస్- 3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్‌లు చేయించి జేసీ సోదరులు అతి పెద్ద కుంభకోణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో శనివారం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విజయవాడ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ జాయింట్ కమిషనర్ ప్రసాద్‌రావు స్పందిస్తూ...' బోగస్ పేపర్లు సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్లు చేసుకున్నందుకే కేసు నమోదు చేశాము. బోగస్ పేపర్లలో ఉన్న సంతకాలు, ఎవరి పేర్లు ఉన్నాయో, అవి ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యాయో వారి పైనే పోలీసులకు ఫిర్యాదు చేశాము. కంప్లెట్ తీసుకుని పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఓనర్లు బాధ్యులా....అశోక్ లైలాండ్ కంపెనీ బాధ్యత ఉందా.. లేక మధ్యలో ఏజెంట్లు నిలబడి మోసం చేశారా అన్నది క్రిమినల్ కేసులో తేలతాయి.
154 వాహనాలల్లో నాగాలాండ్, ఏపీ లో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. వారు నాగాలాండ్‌లో కేసులు పెట్టారన్న సమాచారం మా దృష్టికి రాలేదు. నాగాలాండ్‌లో బోగస్ పేపర్లు సబ్మిట్ చేసాకే మాకు ఎన్‌వోసీ వచ్చింది. 154 వాహనాల్లో 101 వాహనాలు ఏపీలో ఉన్నాయి తాజాగా వాటి రిజిస్ట్రేషన్లు రద్దు చేశాము. ఇప్పటివరకు 62 వాహనాలు సీజ్ చేశాము. మిగిలిన వాహనాలు ఇతర రాష్టాల్లో తిరుగుతున్నాయా లేక ఎక్కడైనా పార్క్ చేసి ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది' అంటూ పేర్కొన్నారు. (ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..!)
ఈ వ్యవహారంపై కూపీ లాగగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటివరకు 154 వాహనాలు నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఫేక్ ఎన్‌ఓసీ, ఫేక్ ఇన్సూరెన్స్‌ల కేసుల్లో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధించి జేసీ ట్రావెల్స్‌పై 24 కేసులు నమోదయ్యాయి. కాగా.. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్‌పై ఇప్పటిదాకా 27 కేసులు నమోదయ్యాయి.(జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట)
Comments
Please login to add a commentAdd a comment