
దోమకొండ: పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరి చేసి ఖాళీ స్థలాన్ని డాక్యుమెంట్ చేసుకున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ సోమవారం తెలిపారు. పంచాయితీ కార్యదర్శి తన సంతకం ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదు చేయగా విచారణ జరిపి కేసు నమోదు చేశామన్నారు. గ్రామానికి చెందిన నందాల ఈశ్వరవ్వ అనే మహిళకు చెందిన 130 గజాల స్థలాన్ని ఆగస్టు 24న బొడపుంటి రవి అనే వ్యక్తి పేరుమీద రిజిస్టర్ చేశారు. రిజిస్ట్రేషన్ సమయంలో పంచాయతీ ధ్రువీకరణ పత్రంతో పాటు, కార్యదర్శి స్టాంప్, సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తమ విచారణలో తెలిందన్నారు. ఈ మేరకు సదరు డాక్యుమెంట్‌ను రద్దు చేసినట్లు సబ్ రిజిస్ట్రర్ స్వామిదాస్ తెలిపారన్నారు. నిందితుడ బొడపుంటి రవితో పాటు నందాల ఈశ్వరవ్వపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.