ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరు వ్యక్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పోలీసులు అరెస్ట్ చేశారు. జార్ఖండ్ లోని బొకారోకు చెందిన స్వరాజ్ కుమార్ రాయ్, సువెందు కుమార్ లను అరెస్టు చేసిన అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ తెలిపిన వివరాల ప్రకారం.. స్వాతంత్ర‍్య దినోత్సవం రోజున తమ శాస్త్రీయ సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటుచేయాలని ప్రధాని కార్యాలయం నుంచి లెటర్ వచ్చినట్లు వారు రాష్ట్ర ఉన్నతాధికారులకు చూపించారు.
దీనిపై విచారణ చేయగా వారు ప్రధాని సంతకాన్ని ఫోర్జరీ చేశారని తేలింది. వీరి దగ్గర నుంచి నఖిలీ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న పోలీసులు న్యాయస్థానంలో హాజరు పర్చగా వారికి జూలై 27 వరకు రిమాండ్ విధించింది.