న్యూఢిల్లీ: ఫోర్జరీ కేసులో కౌంటరు దాఖలు చేయాలని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిల్డింగ్ ప్లాన్ విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈఈ మల్లికార్జునరావు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణ సమయంలో జారీ చేసిన నోటీసులు రెండు రోజుల క్రితమే అందాయని అయ్యన్న పాత్రుడు తరపు న్యాయవాది తెలిపారు. దీంతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అయ్యన్నకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా పడింది.
చదవండి: (ప్రత్యేక హోదాపై గళమెత్తుతాం: వైఎస్సార్‌సీపీ ఎంపీలు)
Comments
Please login to add a commentAdd a comment