Fake Doctor Forgery Signature Accused RMP Arrested In Kukatpally Hyderabad - Sakshi
Sakshi News home page

డాక్టర్‌గా నెలకు 80 వేలు పొందిన ఆర్‌ఎంపీ!

Published Wed, Feb 10 2021 1:34 PM | Last Updated on Wed, Feb 10 2021 3:40 PM

Fake Doctor Forgery Signature Case Accused Arrest In Hyderabad - Sakshi

సాక్షి, కేపీహెచ్‌బీ కాలనీ: నకిలీ ధ్రువపత్రాలతో ఎంబీబీఎస్‌ డాక్టర్‌గా అవతారమెత్తిన ఓ ఆర్‌ఎంపీని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉన్న మెడికల్‌ కౌన్సిల్‌ ధ్రువీకరణ పత్రాలను డౌన్‌లోడ్‌ చేసి ఫోర్జరీ సంతకాలతో పత్రాలను సృష్టించడంతో పాటు పలు ఆస్పత్రులు, రోగులను మోసం చేసిన నకిలీ డాక్టర్‌ బాగోతాన్ని అసలు డాక్టర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ లక్ష్మినారాయణ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా, అల్లవరంకు చెందిన మంగుం కిరణ్‌కుమార్‌ (48) ఆయుర్వేద క్లీనిక్‌లో కాంపౌండర్‌గా చేరి, ఆర్‌ఎంపీగా మారి విశాఖపట్నంలోని ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద 2013 – 2015లో హైమవతి క్లీనిక్‌ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించాడు. అంతాగా లాభం రాకపోవడంతో మూసేశాడు.

ఇంటర్‌నెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిష్టర్‌ అయిన డాక్టర్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తుండగా అతని పేరు, ఇంటి పేరుకు దగ్గరగా ఉన్న కిరణ్‌కుమార్‌ ఎం (ముక్కు) ఎంబీబీఎస్, ఎండీ, జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ పత్రం కంటపడింది. వెంటనే దానిని డౌన్‌లోడ్‌ చేసి కలర్‌ ప్రింట్లు తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ హైదరాబాద్‌ అనే పేరుతో నకిలీ స్టాంపును తయారు చేయించి రిజిస్ట్రార్ సంతకాన్ని తానే ఫోర్జరీ చేశాడు. ఆ  సర్టిఫికెట్లను చూపించి శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరి నెలకు రూ. 80 వేల జీతం పొందాడు.  ఆ తర్వాత కిరణ్‌కుమార్‌ పనితీరుపై ఆసుపత్రి వర్గాలకు అనుమానం రావటంతో చెప్పా పెట్టకుండా అక్కడి నుంచి అమలాపురంలోని శ్రీనిధి ఆస్పత్రిలో రెండు నెలల పనిచేశాడు.

ఆ తర్వాత భీమవరంలోని ఇంపీరియల్‌ ఆస్పత్రిలో చేరాడు. వారికి కూడా అనుమానం రావడంతో 2019లో ఆస్పత్రులకు వెళ్లటం మానేసి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో యూనివర్సిల్‌ క్లీనిక్‌లో, కాంటినెంటల్‌ ఆసుపత్రిలో కన్సల్టెంట్‌ నెఫ్రాలజిస్ట్‌గా పనిచేస్తున్న అసలైన డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ముక్కు, తన ఇన్‌కంటాక్స్‌ రిటర్న్‌ల కోసం ఐటి శాఖను సంప్రందించగా, అక్కడ అతని పేరుతో అప్పటికే రెండు పాన్‌ కార్డులు జారీ అయినట్లు తెలిసింది. దీంతో అనుమానం వచ్చిన కిరణ్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదుతో నకిలీ డాక్డర్‌ కిరణ్‌కుమార్‌ మంగుంను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement