సాక్షి,హైదరాబాద్: టీవీ9 వాటాల వ్యవహారంలో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలపై సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు. ఇటీవల టీవీ9లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ డైరెక్టర్ పి.కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్లతోపాటు ఐపీసీ 406, 420, 467, 469 ,471, 120(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేసి గురువారం విచారణ ప్రారంభించారు. దీంతోపాటుగా నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ వ్యవహారంలో రవిప్రకాశ్‌తో పాటు ఎంకేవీఎన్ మూర్తిపై కూడా ఐటీ యాక్ట్ 66(సీ), 66(డీ), ఐపీసీ 420, 468, 471, 120(బీ) సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. కోర్టు సెర్చ్‌వారంట్ ఆధారంగా గురువారం బంజారాహిల్స్‌లోని టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్ నివాసంలోను, హిమాయత్‌నగర్‌లోని సినీనటుడు శివాజీ, ఖైరతాబాద్‌లోని మూర్తి ఇళ్లలోనూ సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిపిన సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులిచ్చారు. రవిప్రకాశ్ ఇంట్లో లేకపోవడంతో శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలని ఇంటి గోడకు నోటీసులు అతికించారు.
టీవీ9 కార్యాలయంలో బందోబస్తు
బంజారాహిల్స్ టీవీ9 కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉదయం కార్యాలయంలో రవిప్రకాశ్ కోసం ఆరా తీశారు. ఆయన లేరని చెప్పడంతో వివిధ డాక్యుమెంట్లను అడిగి తెప్పించుకున్నారు. సైబరాబాద్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారని ప్రచా రం జరగడంతో పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికు వ చ్చారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అలాగే హిమాయత్‌నగర్ వై జంక్షన్ వద్ద నివాసముంటున్న నటుడు శివాజీ ఇంట్లో ఉదయం 10–11 గంటల మధ్యలో పోలీసులు సోదా లు చేశారు. ఆ సమయంలో హీరో శివాజీ ఇంట్లో లేరు. సోదాల్లో పలు కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది.
రవిప్రకాశ్, శివాజీపై ఫోర్జరీ కేసు
Published Fri, May 10 2019 1:13 AM | Last Updated on Fri, May 10 2019 11:05 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment