
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీవీ 9 తెలుగు ఛానల్ కొత్త సీఈఓగా మహేంద్ర మిశ్రా, సీఓఓగా గొట్టిపాటి సింగారావు నియమితులయ్యారు. ఈ మేరకు అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) బోర్డు నిర్ణయం తీసుకుంది. శుక్ర వారమిక్కడ ఏబీసీపీఎల్ డైరెక్టర్లు జగపతిరావు జూపల్లి, సాంబశివరావు సంగు, శ్రీనివాసరావు అరవపల్లి, పుల్లూరి కౌశిక్‌రావు మీడియాతో మాట్లాడారు. గతే డాది ఆగస్టులో ఏబీసీపీఎల్‌లో అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్స్‌మెంట్ ప్రైవే ట్ లిమిటెడ్ 90.54% వాటాను కొనుగోలు చేసినట్టు సాంబశివరావు వెల్లడించారు. రవిప్రకాశ్, ఇతరులకు 9.5% వాటా ఉన్న ట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో హోల్ టైం డైరెక్టర్ అండ్ సీఈఓ నుంచి రవిప్రకాశ్‌ను, హోల్ టైం డైరెక్టర్ అండ్ సీఎఫ్‌వో పదవుల నుంచి మంగిపూడి కల్యాణ వెంకట నర సింహ మూర్తి (ఎంకేవీఎన్ మూర్తి)లను శాశ్వతంగా తొలగించినట్టు చెప్పారు.
ఇకపై ప్రజలు, బ్యాంకు లు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు, ఇన్‌స్టిట్యూషన్లు ఎవరూ కూడా రవిప్రకాశ్‌తో వ్యవహారా లు, కార్యకలాపాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మైనార్టీ షేర్ ఉంది కాబట్టి షేర్ హోల్డర్స్ సమావేశానికి రవిప్రకాశ్ హాజరుకావొచ్చని.. ప్రాఫిట్స్, డివిడెండ్లను డిక్లేర్ చేయవచ్చన్నారు. ప్రస్తుతం టీవీ 9 కన్నడ హెడ్‌గా మిశ్రా పనిచేస్తున్నారని, టీవీ 9 తెలుగుకు శాశ్వత సీఈఓను నియమించేంత వరకూ ఈయనే పదవిలో కొనసాగుతార న్నారు. 10 టీవీ సీఈఓగా ఉన్న సింగారావుకు 6ఏళ్ల కు పైగా మా టీవీతో అనుబంధం ఉంది. స్టార్ ఇండి యా ప్రైవేట్ లిమిటెడ్ ప్రాసెస్‌లో ఈయన చీఫ్ ఇంటిగ్రేషన్ ఆఫీసర్‌గా, ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్నారు.
ఉద్యోగుల తొలగింపులుండవ్..
టీవీ 9కు తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ, యూఎస్‌ఏ, భారత్‌వర్‡్ష చానల్స్, న్యూస్ 9 బెంగళూరు, టీవీ 1 హైదరాబాద్ చాన ల్స్ కూడా ఉన్నాయి. మేనేజ్‌మెంట్ మారినప్పటికీ.. ఏబీసీపీఎల్, టీవీ 9 బ్రాండింగ్‌లో ఎలాంటి మార్పులూ ఉండవని, ఉద్యోగుల తొలగింపులూ జరగవని సాంబశివరావు స్పష్టంచేశారు. అవసరమైతే కొత్త ఉద్యోగులతో పాటూ చానల్స్ కూడా ప్రారంభిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment