కర్నాటకకి చెందిన ఓ భక్తుడు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరుతో సిఫార్సు లేఖను ఫోర్జరీ చేశాడు. శ్రీవారి దర్శనానికి ఉపరాష్ట్రపతి సిఫార్సు లేఖపై టికెట్లు పోందేందుకు కర్నాటకకి చెందిన బీజేపీ నాయకుడు ప్రయత్నించాడు. నకిలి సిఫార్సు లేఖగా విజిలెన్స్ అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.