లక్నో : వివాదాలతో నిత్యం సావాసం చేసే సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఆజంఖాన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తనను ఓ టెర్రరిస్టులా చూస్తున్నారని ఆరోపించారు. ఫోర్జరీ కేసులో అరెస్టయిన ఆజంఖాన్‌ను పోలీసులు సీతాపూర్ జైలు నుంచి తీసుకొచ్చి రాంపూర్ కోర్టులో శనివారం హాజరుపరిచారు. ఈ సందర్భంగా జైలు వద్ద పోలీసు వ్యాన్‌లో నుంచి విలేకరులతో మాట్లాడిన ఆజంఖాన్ పోలీసులు తనను ఓ ఉగ్రవాదిలా చూస్తున్నారని చెప్పారు.
కాగా, ఈ కేసులో ఆజం ఖాన్, ఆయన భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజంకు రాంపూర్ కోర్టు ఏడు రోజుల జ్యుడిషల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. కాగా ఎంపీ అజంఖాన్‌పై ఇప్పటికే భూకబ్జా, వక్ఫ్ ఆస్తుల స్వాధీనం, రెచ్చగొట్టే వ్యాఖలు చేశారంటూ దాదాపు 80 కేసులు నమోదుకావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment