
పచ్చని కొండలు, జలపాతాల హోరు మధ్య ఉత్కంఠభరితమైన, సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మికత అనుభూతి కూడా పొందాలంటే బెంగళూరుకు 300 కిలోమీటర్ల దూరంలోని దక్షిణ కర్ణాటక పశ్చిమ కనుమల్లో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బండాజే జలపాతం, ధర్మస్థలకు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

బండాజే జలపాతం సముద్రమట్టానికి 2వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇదిప్రముఖ శైవక్షేత్రమైన ధర్మస్థల నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలోని వలంబ్రా అనే గ్రామం వద్దనుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది.

ట్రెక్కింగ్ దట్టమైన అటవీ ప్రాంతం, నీటిప్రవాహాలు, పచ్చని గడ్డిమైదానాలు మీదుగా సాగిపోతుంది

మొత్తం 13 కిలోమీటర్ల మేర సాగే ట్రెక్కింగ్‌లో భాగంగా మొదటిరోజు ఉదయం బేస్ క్యాంప్ వద్ద అల్పాహారం ముగించుకుని ట్రెక్కింగ్ ప్రారంభించాలి

అడవిలోకి ప్రవేశించగానే మొదట కనిపించేది గడ్డిపొదలు. వీటిలో నడుస్తుంటే ఆ అనుభూతే వేరు.

ట్రెక్కర్లు దర్మస్థలం చేరుకుంటే అక్కడ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజిరే వరకు జీపు లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తిరిగి అక్కడినుంచి బండాజే వరకు జీపు, ఆటోరిక్షా అద్దెకు తీసుకుని చేరుకోవాలి. ట్రెక్కర్లు ధర్మస్థల నుంచి ట్రెక్కింగ్ మొదలయ్యే వలంబ్రాకు క్యాబ్‌లో వెళ్లవచ్చు.


















