శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఏడు దేశాలకు ఉచిత వీసాల జారీచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి ఆమోదం తెలిపారు. భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేయిషయా, థాయ్‌లాండ్ పౌరులకు ఉచితం వీసాలు జారీ ప్రతిపాదనను శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ జాబితాలో అమెరికా లేకపోవడం గమనార్హం
పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం తక్షణలమే అమల్లోకి వస్తుందని, మార్చి 31 వరకూ కొనసాగనుందని విదేశాంగమంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. శ్రీలంకకు పర్యాటకులను ఆకర్షించే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటకశాఖ పేర్కొంది. ఈ చర్యతో పర్యాటకానికి ఊతం లభిస్తుందని తాము భావిస్తున్నట్టు శ్రీలంక పేర్కొంది. రాబోయే రోజుల్లో శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య 5 మిలియన్లకు చేరుతుందని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించింది.
కాగా ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటకం ప్రధాన ఆదాయవనరుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశం ప్రకటించిన ఉచిత వీసాల జాబితాలో మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలు పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న రాష్ట్రాలు కావడం విశేషం. శ్రీలకం నిర్ణయంతో ఆయా దేశాలకు చెందిన పర్యాటకులకు వీసా ఖర్చు, సమయం తగ్గనుంది.
చదవండి: రావణుడి వైభోగం ఎంత.. అవశేషాలు ఎక్కడ ఉన్నాయి
Cabinet approves issuing of free visas to India, China, Russia, Malaysia, Japan, Indonesia & Thailand with immediate effect as a pilot project till 31 March -
— M U M Ali Sabry (@alisabrypc) October 24, 2023
Comments
Please login to add a commentAdd a comment