గోవా విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెలుస్తున్నాయి. టాక్సీ మాఫియా, అధిక ధరలే ఇందుకు కారణమని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. గోవాకు రాకపోకలు సాగిస్తున్న పర్యాటకులకు సంబంధించి పారిశ్రామికవేత్త రామానుజ ముఖర్జీ ఎక్స్‌లో డేటాను షేర్ చేశారు. 2019లో గోవా సందర్శకుల సంఖ్య 85 లక్షల నుంచి 2023లో 15 లక్షలకు తగ్గుముఖం పట్టినట్లు డేటాలో వెల్లడించారు.
ముఖర్జీ షేర్ చేసిన డేటాపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మధుర్ స్పందించారు. ‘గోవాలోని బెనౌలిమ్ బీచ్ వద్ద జర్మనీ నుంచి వచ్చిన నా స్నేహితుడిని పికప్ చేసుకోవడానికి వెళ్లాను. వెంటనే దాదాపు పది మందికి పైగా టాక్సీ డ్రైవర్లు నన్ను చుట్టుముట్టారు. విదేశీ పర్యాటకులు స్థానిక టాక్సీలోనే వెళ్లాలని డిమాండ్ చేశారు. తర్వాత నా స్నేహితుడు 37 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1,800 చెల్లించాల్సి వచ్చింది. గోవాలో టాక్సీ మాఫియా పెరుగుతోంది. గోవా అభివృద్ధికి ఈ మాఫియా ఆటంకంగా నిలుస్తోంది’ అని అన్నారు.
Goa’s taxi mafia is responsible for it. 100%
I went to pick up a friend (from Germany) from Benaulim Beach and I was accompanied by another friend (a local Goan). A taxi guy (in Benaulim) saw us, he stopped us and in no time there were 10+ taxi drivers ready to beat us up. The… https://t.co/V43IsQXBm9— Madhur (@ThePlacardGuy) November 5, 2024
ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్
వరుణ్ రావు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ టాక్సీ, ఆటో మాఫియా గోవాలో పర్యాటకం వృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్పారు. ‘ట్యాక్సీ డ్రైవర్లు స్థానిక ప్రభుత్వానికి ప్రధాన ఓటు బ్యాంకు. కాబట్టి వారి ప్రవర్తన వల్ల వృద్ధి కుంటుపడుతున్నా, పర్యాటకులు ఇబ్బంది పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్య తీసుకునే ధైర్యం చేయరు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment