వానొస్తే వాపస్ ఇటలీలో ఎల్బా అనే ఒక పెద్ద ద్వీపం ఉంది. అక్కడి వాతావరణం అమోఘంగా ఉంటుంది. ఇడిలిక్ హాలిడే స్పాట్! మనోహరం అన్నమాట ఇడిలిక్ అంటే. ముదురాకుపచ్చ నీలం రంగులో ఉండే తీరప్రాంతపు ఒడ్డున సన్‌బాత్ చెయ్యడానికి దేశదేశాల నుంచి టూరిస్ట్‌లు వస్తుంటారు. అయితే ఒకటే ప్రాబ్లమ్. సడన్‌గా వాన పడుతుంది. పడితే మంచిదే కదా. కానీ సన్‌బాత్ ఉండదే! అదొక్కటే కాదు ఎండ వల్ల ఒనగూడే అనేక ఆహ్లాదాలు అవిరైపోతాయి.అంత డబ్బు పెట్టి అక్కడి హోటళ్లలో స్టే అయితే.. వానొచ్చి వృధా చేసి వెళ్లిపోయిందే అనిపిస్తుంది.
అందుకే ఇప్పుడు ఎల్బా టూరిస్ట్ శాఖ ఒక ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. వానొస్తే, వచ్చి ఆగకుండా రెండు గంటలపాటు కురిస్తే, ఒక రాత్రి రెంట్‌ను వాపస్ చేస్తుంది. నాలుగు రోజుల స్టే కోసం ఎవరైనా ఎల్బా వచ్చి, వచ్చిన నాలుగు రోజులూ రోజుకు కనీసం రెండు గంటల పాటు వాన కురిస్తే మొత్తం రెంట్ అంతా తిరిగి ఇచ్చేస్తుంది! ఆఫర్ మంచిదే కానీ, ఇంతదూరం వచ్చి వానను మాత్రమే ఎంజాయ్ చేసి వెళ్లడం మళ్లీ అదొక అసంతృప్తి. అదలా ఉంచితే, ఎల్బాకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. నెపోలియన్ ఇక్కడే పది నెలలు అజ్ఞాతంగా గడిపివెళ్లారట.. రెండు శతాబ్దాల క్రితం.
Comments
Please login to add a commentAdd a comment