ఉత్తరప్రదేశ్‌ను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే పనిలో బిజీగా ఉన్న యోగి ప్రభుత్వం.. తాజాగా ‘బ్రాండ్ యూపీ’కి 28 దేశాల్లో ప్రచారం కల్పించే దిశగానూ ప్రణాళిక సిద్దం చేసింది.
యూపీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. 28 దేశాల్లోని 50 నగరాల్లో యూపీలోని పర్యాటక ప్రాంతాలకు ప్రచారం కల్పించనున్నారు. ఇందుకోసం ఆయా నగరాల్లో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు, ట్రావెల్ ఫెయిర్లు, రోడ్ షోలను నిర్వహించనున్నారు. జపాన్, ఇజ్రాయెల్, చైనా, అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయెల్, రష్యా , యుఎఈలలో బ్రాండ్ యూపీకి ప్రచారం కల్పించనున్నారు.
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభించిన దరిమిలా ప్రతి సంవత్సరం కనీసం ఐదు కోట్ల మంది పర్యాటకులు నగరానికి వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఈ సంఖ్య స్వర్ణ దేవాలయం, తిరుపతి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య కంటే చాలా ఎక్కువ. అయోధ్యలో ప్రారంభమైన విమానాశ్రయం, ఆధునీకరించిన రైల్వే స్టేషన్, మెరుగైన రహదారులు మొదలైనవన్నీ పర్యాటకులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment